iPhone: ఐఫోన్‌ స్క్రీన్‌ లాక్ అయినా.. వర్డ్‌ డాక్యుమెంట్స్‌ ఎంచక్కా వినొచ్చు..!

ఐఫోన్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్‌ త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇక వర్డ్‌ డాక్యుమెంట్స్‌ను ఫోన్‌ లాక్‌ అయినా.. వినేలా సరికొత్త సదుపాయాన్ని కల్పించనుంది.

Published : 22 May 2022 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ యూజర్లకు త్వరలో మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇక వర్డ్‌ డాక్యుమెంట్స్‌ను ఫోన్‌ లాక్‌ అయినా ఎంచక్కా వినేలా కొత్త సదుపాయాన్ని కల్పించనుంది.  ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఇన్‌సైడర్‌  వెల్లడించింది. అంతేకాకుండా ఇన్‌సైడర్‌ ఆఫీస్‌ మొబైల్‌ యాప్‌లో అవుట్‌లుక్‌కి పంపిన ఈమెయిల్‌ పీడీఎఫ్‌లనూ ఇది ట్రాక్‌ చేస్తుందని తెలిపింది. ఆఫీస్‌ మొబైల్‌లోని షేర్డ్‌ ట్యాబ్‌లో పంపిన పీడీఎఫ్‌లు కనిపిస్తాయని పేర్కొంది.

ఈ కొత్త ఫీచర్‌ ముందుగా ప్రస్తుతం ఉన్న ఐఓఎస్‌ వెర్షన్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇన్‌సైడర్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఐఫోన్ స్క్రీన్ లాక్ అయినప్పటికీ, వెర్షన్ 2.61 అప్‌గ్రేడ్ వర్డ్ డాక్యుమెంట్‌లను వినడానికి ఇది సాయపడుతుంది. ఇది ఇప్పటికే ఉన్న రీడ్‌ అలౌడ్‌ టూల్‌కు అదనంగా పనిచేస్తుంది. ఇది వర్డ్‌ డాక్యుమెంట్‌లోని టెక్ట్స్‌ను స్పీచ్‌లోకి మార్చి ప్రీ-ప్రోగామ్‌ చేసి యూజర్లకు చదివి వినిపించగలదు.

‘‘వర్డ్‌ డాక్యుమెంట్‌ను వినే క్రమంలో ఐఓఎస్‌ డివైజ్‌ స్క్రీన్‌కు, యూజర్ల కళ్లకు విశ్రాంతి కలిగించడానికి ఇదొక అద్భుతమైన మార్గం’’ అని మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఈ ఫీచర్‌ను ఎలా టర్న్‌ ఆన్‌ చేసుకోవాలో కూడా వివరించింది. దీనికోసం ప్రత్యేకంగా సెట్టింగ్స్‌ను మార్చుకోనవసరం లేదని తెలిపింది. రీడ్‌ అలౌడ్‌ ఎనేబుల్‌ చేసుకుంటే డిఫాల్ట్‌గా ఇది టర్న్‌ ఆన్‌ అవుతుందని వెల్లడించింది. 

దీనికోసం ఐఫోన్‌ యూజర్లు వర్డ్‌ డాక్యుమెంట్‌లో ఉన్న రివ్యూ మెనూలో ఆటోమెటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్స్ట్‌ను ఎంచుకోవాలి. ఐప్యాడ్‌లోనైతే ఓవర్‌ఫ్లో మెనూలో ఈ ఆప్షన్‌ ఉంటుంది. డాక్యుమెంట్‌లో కర్సర్‌ ఉన్న చోటు నుంచి రీడింగ్‌ స్టార్ట్‌ చేస్తుంది. ఒకవేళ ఫోన్‌ లాక్‌ అయినా ఈ ఫీచర్‌ సాయంతో కంటిన్యూగా చదువుతూనే ఉంటుంది. ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరలో నాన్‌ ఇన్‌సైడర్‌ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది. దీన్ని ఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌లోనూ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని