iOS 15 Update: ఐఓఎస్‌ అప్‌డేట్‌.. ఈ ఫీచర్‌తో నోట్స్‌ మేకింగ్ మరింత సులువు!

యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ యూజర్ల కోసం కొత్తగా ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఓఎస్‌ 15.4 వెర్షన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ అప్‌డేట్‌ యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను పరిచయం చేసింది. 

Published : 22 Mar 2022 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ యూజర్ల కోసం కొద్దిరోజుల క్రితం ఐఓఎస్‌ 15.4 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇందులో ఫేస్‌ఐడీ మాస్క్‌, కొత్త ఎమోజీలు, సిరి కొత్త వాయిస్‌  వంటి వాటితోపాటు స్కాన్‌ టెక్ట్స్‌ అనే ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. వీటిలో ఫేస్‌ఐడీ మాస్క్‌ ఫీచర్‌తో యూజర్‌ ఫేస్‌ మాస్క్‌ ధరించినా కూడా ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది. ఇందుకోసం యూజర్‌ ఐఫోన్‌ సెట్టింగ్స్‌లో ఫేస్‌ఐడీ అండ్ పాస్‌కోడ్‌ సెక్షన్‌లో యూజ్‌ ఫేస్‌ ఐడీ విత్‌ ఏ మాస్క్‌ (Use Face ID With A Mask) ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.

ఐఓఎస్‌ 15.4 వెర్షన్‌లో స్కాన్‌ టెక్ట్స్‌ (Scan Text) ఫీచర్‌ సాయంతో యూజర్స్‌ ఐఫోన్‌ కెమెరాతో టెక్ట్స్‌ను స్కాన్‌ చేసి నోట్‌పాడ్‌లోకి మార్చుకోవచ్చు. ఐఫోన్‌ 15లో వచ్చిన లైవ్‌ టెక్ట్స్‌ (Live Text) ఫీచర్‌కు లైట్‌ వెర్షన్‌గా స్కాన్‌ టెక్ట్స్‌ను తీసుకొచ్చినట్లు సమాచారం. లైవ్‌ టెక్ట్స్‌ ఫీచర్‌తో యూజర్స్‌ కెమెరా ద్వారా సమాచారాన్ని సేకరించి దాన్ని ఫొటో రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. అలానే కెమెరాతో స్కాన్‌ చేసిన టెక్ట్స్‌ లేదా మొబైల్‌ గ్యాలరీలోని ఫొటోలోని టెక్ట్స్‌తో మెయిల్‌, కాలింగ్‌, మ్యాప్‌ వంటి వాటితోపాటు టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. 

స్కాన్‌ టెక్ట్స్‌ ఫీచర్‌లో మాత్రం కేవలం కెమెరాతో స్కాన్‌ చేసిన టెక్ట్స్‌ను నోట్స్‌లా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ కోసం యాపిల్ ఐఫోన్‌లో నోట్స్‌ (Notes) యాప్‌ ఓపెన్‌ చేసి ఏదైనా నోట్స్‌ ఓపెన్‌ చేయాలి. అందులో న్యూ నోట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే కెమెరా ఐకాన్‌ కనిపిస్తుంది. అందులో స్కాన్‌ టెక్ట్స్‌ ఆప్షన్‌ సెలెక్ట్ చేసి, మీకు కావాల్సిన టెక్ట్స్‌ను స్కాన్‌ చేసి నోట్స్‌లో యాడ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని