Door Detection: ‘యాపిల్‌’ వారికి దారి చూపుతుంది.. నడిపిస్తుంది!

కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న దివ్యాంగుల కోసం దిగ్గజ కంపెనీ యాపిల్‌ కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రకటించింది. తన రాబోయే కొత్త ఉత్పతుల్లో..

Updated : 19 May 2022 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి కోసం దిగ్గజ కంపెనీ యాపిల్‌ కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రకటించింది. తన రాబోయే కొత్త ఉత్పత్తుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. వీటిల్లోని డోర్‌ డిటెక్షన్‌ ఫీచర్.. వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తూ డోర్‌ వద్దకు నడిపిస్తుంది. ఇందులోని హార్ట్‌వేర్‌, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ద్వారా డోర్‌ హ్యాండిల్‌ను తిప్పాలా? పుల్‌ లేదా పుష్‌ చేయాలా? అనేది చెబుతుంది. అదనంగా, డోర్‌పై ఇతర సంకేతాలు, చిహ్నాలు ఉంటే వాటినీ గుర్తించి అంతస్తుల్లో సరైన చోటుకు చేరుస్తుంది.

ఈ రెండు కలిసి పనిచేయగలవు

ఇందుకు మార్గంమధ్యలోని ఇతర విషయాలు, డోర్‌ను కచ్చితంగా గుర్తించడానికి LiDAR ఫీచర్‌ కెమెరా, ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను వినియోగించనున్నట్లు యాపిల్‌ తెలిపింది. అలాగే కొత్తగా తీసుకొచ్చే మాగ్నిఫైయర్ యాప్ (Apple's Magnifier app) వ్యక్తుల గుర్తింపు, పరిసరాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని పేర్కొంది. వినియోగదారులకు మరింత సహాయాన్ని అందించడానికి డోర్ డిటెక్షన్‌ ఫీచర్‌తో కలిసి ఇది పని చేయగలదని వెల్లడించింది.

ఉన్న వాటినే మరింత మెరుగ్గా..

మరోవైపు యాపిల్‌ మ్యాప్స్‌ వంటి ఇతర యాప్‌లను కంపెనీ అప్‌డేట్‌ చేయాలని చూస్తోంది. తద్వారా నావిగేషన్‌ ప్రారంభ, ముగింపు స్థానాల్లో వైబ్రేషన్‌, వాయిస్‌ ఓవర్‌ వంటి ఫీచర్లను మరింత మెరుగుపరచనుంది. వినికిడి లోపం ఉన్నవారి కోసం లైవ్‌ క్యాప్షన్‌లను డిస్‌ప్లే చేసేలా ప్రయత్నాలూ చేస్తుంది. ఇక యాపిల్ వాచ్ మిర్రరింగ్ సహాయంతో వినియోగదారులు తమ వాచ్‌ను రిమోట్‌గా ఉపయోగించుకోవచ్చు. ట్యాపింగ్‌ వంటి సంజ్ఞలతో కాల్స్‌, నోటిఫికేషన్స్‌, ప్లేబ్యాక్‌ మ్యూజిక్‌ను నియంత్రించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

వచ్చే ఏడాదికే..

అయితే, ఈ ఏడాది తర్వాత తీసుకొచ్చే కొత్త ఉత్పత్తుల్లో ఈ డోర్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటితో పాటే ఐఫోన్ 13 ప్రో, ప్రో మ్యాక్స్‌, 12 ప్రో మ్యాచ్స్‌, ఐప్యాడ్‌ ప్రో-2020, 2021, 2020 మోడల్స్‌ అప్‌డేట్‌లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.


Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని