5G Smartphone: ₹15 వేలకే అదిరిపోయే ఫీచర్లతో ఐకూ 5జీ ఫోన్‌!

ఐకూ కంపెనీ ₹15 వేల రేంజ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐకూ Z6 5జీ పేరిట కొత్త ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది.

Published : 16 Mar 2022 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ సేవలు ఇంకా ప్రారంభం కాకముందే 5జీ స్మార్ట్‌ఫోన్లు మాత్రం మొబైల్‌ మార్కెట్‌కు వరుసగా క్యూ కడుతున్నాయి. ఒకప్పుడు దాదాపు ₹20 వేలు ప్రారంభ ధర పలికిన ఈ ఫోన్లు.. ఇప్పుడు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా ఐకూ కంపెనీ ₹15 వేల రేంజ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐకూ Z6 5జీ పేరిట కొత్త ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది.

ఈ ఫోన్‌ మొత్తం మూడువేరియంట్లలో వస్తోంది. 4జీబీ వేరియంట్‌ ధరను రూ.15,499గా నిర్ణయించారు. 6జీబీ వేరియంట్‌ ధరను రూ.16,999గానూ, 8జీబీ వేరియంట్‌ను రూ.17,999గా కంపెనీ పేర్కొంది. మార్చి 22 నుంచి అమెజాన్‌, ఐకూ ఇండియా ఇ-స్టోర్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. లాంచింగ్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై రూ.2వేలు ఇస్తున్నారు. నో-కాస్ట్‌ ఈఎంఎఐ, ఎక్స్ఛేంజీ సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 12తో కూడిన ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12తో ఈ ఫోన్‌ వస్తోంది. 6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 120 Hz రీఫ్రెషర్‌రేట్‌ కలిగిన డిస్‌ప్లే అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. మూడింట్లోనూ 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. 50 మెగాపిక్సల్‌ ప్రధాన కెమెరాతో పాటు 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ బొకే సెన్సర్లు అమర్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. టైప్‌-సి పోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18w ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని