Internet: రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు 

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సమస్య లేదా సందేహం వచ్చినా దాని గురించి తెలుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికేస్తుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి...

Published : 19 Jul 2021 23:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సమస్య లేదా సందేహం వచ్చినా దాని గురించి తెలుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికేస్తుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్‌ను విజయవంతంగా పరీక్షించి రికార్డు నెలకొల్పారు. దీని ద్వారా సెకనుకు 319 టెరాబైట్స్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను అందిచవచ్చని తెలిపారు. దీంతో గతేడాది నమోదు చేసిన 178 టెరాబైట్/సెకన్‌ రికార్డ్‌ను తిరగరాసినట్లు తెలిపారు. 

జపాన్‌కు చెందిన ఎన్‌ఐసీటీ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఈ ప్రయోగాత్మక పరీక్షను నిర్వహించింది. ఇందుకోసం అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతోపాటు స్టాండర్డ్ అవుటర్ డయామీటర్‌, 4-కోర్ ఆప్టికల్‌ ఫైబర్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. అలానే ఎర్బియం, థులియం కలయికతో రూపొందించిన ఫైబర్ యాంప్లిఫయర్‌, రామన్ యాంప్లిఫికేషన్ ద్వారా 3,001 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఇంటర్నెట్‌ను ట్రాన్స్‌మిట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరీక్షించిన ఇంటర్నెట్ వేగం భవిష్యత్తులో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించే కమ్యూనికేషన్ సిస్టంలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని