JioPhone Next తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు.. జియో ఫోన్‌ నెక్స్ట్‌ ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో..

జియో ఫోన్‌ నెక్స్ట్‌ (JioNext) ఎట్టకేలకు మార్కెట్లోకి పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. సామాన్యుడికి సరసమైన ధరలో..

Published : 06 Mar 2022 19:20 IST

దిల్లీ: భారతీయ టెలికాం దిగ్జజం జియో సంస్థ గూగుల్‌తో కలిసి తీసుకొచ్చిన జియో ఫోన్‌ నెక్స్ట్‌ (JioPhone Next) ఎట్టకేలకు మార్కెట్లోకి పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. గతేడాది దీపావళికి విడుదలైన ఈ మొబైల్‌ను ఇక మీదట రిలయన్స్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. సామాన్యుడి దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలో 4జీ సౌలభ్యం, ప్రీమియం ఫీచర్‌లతో జియో ఈ మొబైల్‌ను అభివృద్ధి చేసింది.

5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ స్క్రీన్‌తో వచ్చే ఈ పాకెట్-ఫ్రెండ్లీ ఫోన్‌.. 2జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. పైగా మెమరీని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్‌ 215 క్యూఎమ్‌ ప్రాసెసర్‌, వెనుకాల 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటో ఫోకస్‌ కెమెరాల, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులోని మరిన్ని ప్రత్యేకతలు. వాయిస్‌ అసిస్టెంట్‌, ఆటోమెటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్ట్స్‌, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌తో వచ్చే ఈ మొబైల్‌ సరికొత్త ‘ప్రగతి ఓఎస్‌’పై రన్‌ అవ్వడం విశేషం. ప్రీలోడెడ్ జియో, గూగుల్ యాప్‌లు ఉంటాయి. బ్లూటూత్, వైఫై, హాట్ స్పాట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక జియోఫోన్ నెక్స్ట్‌ ధరను కంపెనీ రూ.6,499గా నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని