Published : 03 Nov 2021 01:48 IST

JioPhone Next: జియోఫోన్ నెక్స్ట్‌ ప్రాసెసర్.. ఎలా పనిచేస్తుందంటే?  

ఇంటర్నెట్‌డెస్క్‌: దీపావళికి జియోఫోన్ నెక్స్ట్‌ తీసుకొస్తున్నట్లు గూగుల్, జియో సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఫోన్‌ ఫీచర్స్‌, ధర, ఈఎంఐ ప్లాన్లకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాయి. అయితే ఈ ఫోన్‌లో ఉపయోగిస్తున్న ప్రాసెసర్‌ గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు. జియోఫోన్ నెక్స్ట్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ క్యూఎమ్215 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు మాత్రమే తెలిపాయి. ఇది యూజర్స్‌కి మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించడంతోపాటు లొకేషన్‌ టెక్నాలజీ పనితీరు, ఆడియో, బ్యాటరీ పరంగా కూడా ఉత్తమమైన పనితీరును కనబరుస్తుందని క్వాల్‌కోమ్ సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ ప్రాసెసర్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్స్‌ని టెక్ నిపుణులు వెల్లడించారు. 

ఈ ప్రాసెసర్‌ను 2019లోనే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఏఆర్‌ఎమ్‌ కోర్‌టెక్స్‌-ఏ53 పేరుతో రూపొందించారట. తాజాగా కొన్ని మార్పులు చేసి స్నాప్‌డ్రాగన్ క్యూఎమ్‌215 పేరుతో తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ప్రాసెసర్‌ 13 ఎంపీ కెమెరాను సపోర్ట్ చేస్తుందట. దీని సీపీయూ క్లాక్‌ స్పీడ్ 1.3 గిగాహెర్జ్‌ ఉంటుందని సమాచారం. ఇందులో ఆడ్రెనో 308 గ్రాఫిక్‌ కార్డ్ ఉపయోగించారని తెలుస్తోంది. అలానే ఈ ప్రాసెసర్ అన్నిరకాల లైట్ వెర్షన్ యాప్‌లు ఉపయోగించేందుకు, తక్కువ సైజ్‌ ఉన్న మొబైల్ గేమ్‌లు ఆడేందుకు చక్కగా సరిపోతుందట. బ్లూటూత్‌ 4.2, వైఫై 802, 150 ఎమ్‌బిట్స్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో కాట్‌ 4 4జీ-ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం.  

ఇప్పటికే ఈ ఫోన్‌ను రివ్యూల కోసం పలువురు టెక్‌ నిపుణులకు అందించినట్లు తెలుస్తోంది. దీంతో విడుదలకు ముందే ఈ ఫోన్ పనితీరును విశ్లేషించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జియోఫోన్ నెక్స్ట్‌ మెరుగైన పనితీరు కనబరిచినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఫోన్ విడుదల వరకు వేచిచూడాల్సిందే. ఈ ఫోన్‌ను 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌ వేరియంట్లో తీసుకొస్తున్నాయి. జియో స్మార్ట్‌ఫోన్‌లో అన్ని జియో, గూగుల్ యాప్‌లు ప్రీలోడెడ్‌గా ఇస్తున్నారు. ముందు 13 ఎంపీ, వెనుక 8 ఎంపీ కెమెరాలున్నాయి. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. జియోఫోన్ నెక్స్ట్‌ ధర రూ.6,499 కాగా, ముందుగా రూ.1,999 చెల్లించి వినియోగదారులు ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 నెలల వ్యవధిలో వాయిదా పద్ధతి (ఈఎంఐ)లో చెల్లించవచ్చని తెలిపింది. ఇందుకోసం జియో రీఛార్జ్‌ ప్లాన్లతో కూడిన ఆల్వేస్‌-ఆన్‌, లార్జ్‌, ఎక్స్‌లార్జ్‌, ఎక్స్‌ఎక్స్‌లార్జ్‌ అనే నాలుగు వాయిదా పథకాలను ప్రకటించింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని