
JioPhone Next: ఆన్లైన్లో అందుబాటులోకి జియో ఫోన్ నెక్స్ట్
ఇంటర్నెట్ డెస్క్: జియో ఫోన్ నెక్స్ట్స్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ కొనుగోలు చేయాలంటే రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. ఇకపై అలాంటిదేమీ లేకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చు. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్లి రూ.6,499 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. నలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు.
ఒకవేళ మీరు నగరాల్లో ఉన్నట్లయితే.. కొద్ది గంటల్లోనే ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. లేదంటే మీ దగ్గర్లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కి వెళ్లి ఈ ఫోన్‌ను తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వారికి సాధారణ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే... గూగుల్‌తో భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ప్రగతి ఓఎస్ పేరిట కస్టమైజ్ చేసిన ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఓఎస్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 215 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సదుపాయం ఉంది. ఈ ఫోన్‌ను తొలుత రూ.1999 చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ఇందుకోసం వివిధ ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది.
అందుబాటులో ఉన్న ప్లాన్ల వివరాలు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.