Malware: ‘జోకర్‌’ రీఎంట్రీ.. జాబితాలో మరిన్ని యాప్‌లు

జోకర్‌ మాల్‌వేర్‌ రీఎంట్రీ ఇచ్చింది. మీ మొబైల్‌లో ఈ యాప్‌లుంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 

Published : 24 Dec 2021 22:18 IST

దిల్లీ: జోకర్‌ మాల్‌వేర్‌ (Joker malware).. గత కొన్నేళ్లుగా అందరి నోట వినిపిస్తున్న మాచెడ్డ టెక్‌ వైరస్‌. ఇటీవల జోకర్‌ రీఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే ఏడు ఆండ్రాయిడ్‌ యాప్‌లలో మళ్లీ జోకర్‌ ప్రత్యక్షమైనట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ హెచ్చరించింది. తాజాగా మరో 7 ఆండ్రాయిడ్‌ యాప్‌లలో దీనిని గుర్తించినట్లు మొబైల్‌ సెక్యూరిటీ సంస్థ ప్రడియో (Pradeo) వెల్లడించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను నాశనం చేయడం, విలువైన సమాచారాన్ని కాజేయడమే లక్ష్యంగా.. 2017లో జోకర్‌ బయటపడింది. దీనిపై గూగుల్‌ ఎప్పటిప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. మాల్‌వేర్‌ ప్రత్యక్షమైన యాప్‌లను ప్లేస్టోర్‌ (Google PlayStore) నుంచి తొలగిస్తూ వస్తోంది. మీ మొబైల్‌లోనూ ఈ యాప్‌లు ఉంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి.

మాల్వేర్‌ ప్రత్యక్షమైన తాజా యాప్స్‌ జాబితా...

* కలర్‌ మెసేజ్‌ (Color Message)

* సేఫ్టీ యాప్‌ లాక్‌ (Safety AppLock)

కన్వినెంట్‌ స్కానర్‌ 2 (Convenient Scanner 2)

పుష్‌ మెసేజ్‌ - టెక్స్టింగ్‌ అండ్‌ ఎస్‌ఎంఎస్‌ (Push Message-Texting&SMS)   

* ఎమోజీ వాల్‌పేపర్‌ (Emoji Wallpaper)

* సెపరేట్‌ డాక్‌ స్కానర్‌ (Separate Doc Scanner)

ఫింగర్‌టిప్‌ గేమ్‌బాక్స్‌ (Fingertip GameBox)

గతంలో జెడ్‌స్కేలర్‌ గుర్తించిన యాప్‌లు

1. నౌ స్కాన్‌ క్యూఆర్‌ కోడ్‌ (Now scan QRcode)

2. ఎమోజీ వన్‌ కీబోర్డు (EmojiOne Keyboard)

3. బ్యాటరీ ఛార్జింగ్‌ యానిమేషన్స్‌ బ్యాటరీ వాల్‌పేపర్‌ (Battery Charging Animations Battery Wallpaper)

4. డాజ్లింగ్ కీబోర్డ్‌ (Dazzling Keyboard)

5. వాల్యూమ్‌ బూస్టర్‌ లౌడ్‌స్పీకర్‌ (Volume Booster Loudspeaker)

6. సూపర్‌ హీరో-ఎఫెక్ట్‌ (Superhero-Effect)

7. క్లాసిక్‌ ఎమోజీ కీబోర్డు (Classic Emoji Keyboard)

తప్పించుకోవడం ఎలా..?  

‘జోకర్‌’ ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించడమే కాకుండా డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెడుతుంటారు. అనుమతి లేకుండానే పేమెంట్ సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసి ఖాతాలను ఖాళీ చేస్తుంటారు. అయితే, సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు యాంటీ వైరస్‌ (Anti Virus) సాప్ట్‌వేర్ వాడటంతో పాటు కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేసేముందు అనుమతులు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జోకర్‌ మాల్‌వేర్‌ కెమెరా, గేమింగ్, మెసేజింగ్, ఫొటో ఎడిటింగ్, ట్రాన్స్‌లేషన్, వాల్‌పేపర్ యాప్స్‌పై దాడి చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని