Google Password Manager: హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్.. ఇక ఆ చింతక్కర్లేదు!
ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్, యూజర్ నేమ్ గుర్తుంచుకోవాల్సిన అవసరంలేకుండా గూగుల్ పాస్వర్డ్ మేనేజర్‌ను ఉపయోగిస్తుంటారు. మరి ఈ పాస్వర్డ్ మేనేజర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం...
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు లావాదేవీలైనా, నగదు చెల్లింపులైనా, కొనుగోళ్లయినా అన్నీ ఉన్నచోటు నుంచే ఆన్లైన్లో కానిచ్చేస్తున్నాం. వీటి లాగిన్ సమాచారం ఇతరులు యాక్సెస్ చేయకుండా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు యూజర్ డేటా కోసం సైబర్ దాడులు జరుగుతున్నాయి. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు చాలా మంది పాస్వర్డ్ మేనేజర్లను వినియోగిస్తుంటారు. వాటిలో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ (Google Password Manager) కూడా ఒకటి. దీంతో అన్ని ఖాతాల పాస్వర్డ్, యూజర్‌నేమ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఒకచోట భద్రపరచుకోవచ్చు. మరి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్క్రీన్కు ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్వర్డ్ అండ్ అకౌంట్స్ (Password and Accounts) సెక్షన్లో గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది.
- తర్వాత కుడివైపు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో యాడ్ షార్ట్‌కట్ టు యువర్ హోమ్ స్క్రీన్ (Add Shortcut to Your Home Screen) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే కన్ఫర్మ్ చేయమని కోరుతూ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. అందులో యాడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఐకాన్ మీ హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్లు చెక్ చేసుకోవచ్చు.
- గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో మీరు సేవ్ చేసుకునే పాస్వర్డ్లు హ్యాకింగ్‌కు అనుకూలంగా ఉంటే వెంటనే వాటిని మార్చుకోమని సూచిస్తుంది.
- ఇందులోని బిల్ట్-ఇన్ సెక్యూరిటీ మోడ్ మీ పాస్‌వర్డ్‌లను భద్రపరచడమే కాకుండా, బ్రౌజర్లో మీరు ఖాతాలను తెరిచేప్పుడు పాస్‌వర్డ్‌లను ఆటో ఫిల్ చేస్తుంది. దీంతో యూజర్ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు. -
లెక్కల్లో గూగుల్ సాయం
లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. -
విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్
గూగుల్, సామ్సంగ్ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా జనరేటివ్ ఎరేజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. -
ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్ జాబితా
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. -
పెయింట్‌లోనే ఏఐ!
పదాల కూర్పుతో (ప్రాంప్ట్) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్ఇన్ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు -
అంధులకు దారిచూపు
కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు -
మెసేజెస్ నుంచే ఫొటో షేర్
ఫోన్లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్ చేస్తుంటాం. ఐఫోన్ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు -
యాప్ మాటలు వింటోందా?
ఫోన్లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్సైట్ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది. -
గూగుల్ కొత్త ఏఐ టూల్స్
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్ తమ ఏఐ వేదిక బార్డ్ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్, టెక్స్ట్ఎఫ్ఎక్స్ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది. -
గూగుల్ మ్యాప్స్‌తో గాలి నాణ్యత
గాలి నాణ్యత మన ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కలుషితమైన గాలి ఉబ్బసం వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. -
హెచ్‌పీ నుంచి ఏఐ ల్యాప్‌టాప్‌లు
ప్రస్తుతం పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత సహాయకుడు కూడా. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయటం అనివార్యమైన తరుణంలో కొత్తరకం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. -
స్పోటిఫై డేలిస్ట్
అతిపెద్ద మ్యూజిక్ లైబ్రరీ, ఆకట్టుకునే యూజర్ ఇంటర్ఫేస్తో స్పోటిఫై ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన సంగీత వారధిగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ మరింతగా ఆకట్టుకుంటూ వస్తోంది. ఇందులో డేలిస్ట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా పాటలు, సంగీత ట్రాక్‌లను జోడిస్తుంది. -
డాక్యుమెంట్లో డిజిటల్ సంతకం
గూగుల్ డాక్యుమెంట్ల మీద డిజిటల్ సంతకం చేయాలనుకుంటున్నారా? ఇందుకు బిల్టిన్‌గా ఉండే ఇ-సిగ్నేచర్ టూల్స్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈమెయిల్ మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల ధ్రువీకరణ కోసం డిజిటల్ సంతకాల అవసరం పెరిగిపోతున్న తరుణంలో దీని గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. -
అన్ని విండోలూ ఒకేసారి మినిమైజ్
డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ మీద ఎన్నో వెబ్సైట్లు, ఫైళ్లు ఓపెన్ చేస్తుంటాం. అవసరం లేని విండోస్‌ను మినిమైజ్ చేస్తుంటాం కూడా. కానీ అన్నింటినీ ఒకేసారి మినిమైజ్ చేయాలంటే? విండోస్ కీ, ఎం మీటలను కలిపి నొక్కితే సరి. -
టాస్క్.. ఆటోమేటిక్!
వారానికోసారి డిస్క్ క్లీనప్ చేయటం, నిర్ణీత సమయానికి ఈమెయిల్ పంపటం వంటి తరచూ చేసే పనులు ఆటోమేటిగ్గా జరిగితే బాగుండునని చాలాసార్లు అనిపిస్తుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్‌లకు సూర్య దూరమేనా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్