ఫోన్లో వైరస్..తెలుసుకోవడం ఎలా?
ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ వినియోగించనివారు అరుదు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ మోసాలు పెరిగిపోయాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి వైరస్ వచ్చి చేరుతుంది. మరి ఫోన్లో వైరస్ ఉన్న విషయం ఎలా గుర్తించాలి....
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ వినియోగించనివారు అరుదు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన చేతిలో ఉంటుందనే భావన. గతంలో సమాచార బదిలీకి మాత్రమే పరిమితమైన ఫోన్ వినియోగం..సాంకేతికత అభివృద్ధితో మెసేజ్‌లు, వీడియో కాలింగ్, పేమెంట్స్, ఎంటర్టైన్మెంట్ సేవలకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ మోసాలు పెరిగిపోయాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి వైరస్ వచ్చి చేరుతుంది. కొత్త యాప్ లేదా వెబ్ పేజ్‌లను యాక్సెస్ చేసినప్పుడు వైరస్/మాల్వేర్తో హ్యాకర్స్ దాడి చేస్తున్నారు. మరి ఫోన్లో వైరస్ ఉన్న విషయం ఎలా గుర్తించాలి..మాల్వేర్ బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం.
పాప్-అప్ యాడ్
కొన్నిసార్లు ఫోన్లో సోషల్ మీడియా, ఈ-మెయిల్ లేదా ఇతర యాప్‌లు ఉపయోగించినప్పుడు మీ ప్రమేయం లేకుండా ఫోన్ స్క్రీన్ మీద కొన్ని రకాల పాప్-అప్ యాడ్స్ కనిపిస్తుంటాయి. వీటిని యాడ్వేర్ అంటారు. అలాంటి వాటిని గుర్తిస్తే మీ ఫోన్లో మాల్వేర్/వైరస్ ఉన్నట్లు భావించాలి. అలానే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తరచుగా వ్యాపార ప్రకటనలు కనిపిస్తే సదరు యాప్‌ను తొలగించడం ఉత్తమం.
ఫోన్ పనితీరు, బ్యాటరీపై ప్రభావం
ఒక్కోసారి మీ ఫోన్ ఉన్నట్లుండి నెమ్మదిస్తుంది. అంతేకాకుండా సడెన్‌గా స్విఛ్ఆఫ్ అయిపోవడం, తరచుగా వేడెక్కడం వంటివి జరుగుతుంటే, మీ ఫోన్లో మాల్వేర్/వైరస్ ఉన్నట్లు గుర్తించాలి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మన ఫోన్లో సమాచారాన్ని హ్యాకర్స్‌కి చేరవేస్తాయి. అలానే ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం, మళ్లీ ఛార్జింగ్ చేయాల్సి రావటం, ఫోన్ ఛార్జ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంటే కూడా అనుమానించాల్సిందే.
పేమెంట్ కోసం డిమాండ్
ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదైనా యాప్ లేదా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీ ప్రయేయం లేకుండా వాటంతటవే క్లోజ్ అవుతాయి. తిరిగి మీరు వాటిని ఉపయోగించాలంటే కొంత నగదు చెల్లించమని మెసేజ్ కనిపిస్తుంది. దీన్నే రాన్సమ్వేర్ అంటారు.
అపరిచిత అప్లికేషన్స్
మన అవసరాని తగినట్లుగా ఎన్నో రకాల అప్లికేషన్లను డౌన్లోడ్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే కొన్ని అప్లికేషన్లు వాటంతటవే డౌన్లోడ్ అవుతుంటాయి. అలా ఏదైనా యాప్ మీ ఫోన్లో కనిపిస్తే వెంటనే డిలీట్ చేయండి. వాటి ద్వారా వైరస్/మాల్వేర్ మీ ఫోన్లో వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిలో ఎక్కువ స్పైవేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫోన్‌పై నిరంతరం నిఘా పెడుతూ, యూజర్ డేటాను హ్యాకర్స్‌కి చేరవేస్తాయి. వాటి వల్ల ఫొటోస్, వీడియోలతో పాటు ఫోన్లలో నిక్షిప్తం అయ్యే డేటాకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. అలానే ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంటే వెంటనే సదరు యాప్‌ను డిలీట్ చేయండి. ఎక్కువ శాతం హ్యాకర్స్ యాప్స్ ద్వారానే వైరస్‌ను ఫోన్లలోకి పంపుతుంటారు.
మాల్వేర్ను అడ్డుకోవడం ఎలా..?
* మీ ఫోన్లో మాల్వేర్/వైరస్ ఉన్నట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా యాంటీ వైరస్ లేదా యాంటీ మాల్వేర్ ప్రోగ్రాం ఇన్స్టాల్ చేసుకోమని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఇవి ఫోన్‌ని పూర్తిగా స్కాన్ చేసి ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్ ఉంటే గుర్తించి రిపోర్టు చూపిస్తుంది.
* ఫోన్లో మాల్వేర్ తొలగించేందుకు ఉన్న మరో మార్గం ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్. ఇలా చేయడం వల్ల ఫోన్లో ఇన్స్టాల్ చేసిన అన్ని ప్రోగ్రాములు డిలీట్ అయిపోయి, సెట్టింగ్స్ మారిపోయి ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో అలా మారిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ ప్యాక్టరీ రీసెట్ చేయాలంటే మీ కాంటాక్ట్స్‌తో పాటు ఇతర డేటాను బ్యాకప్ చేసుకోవడం మరిచిపోకండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం