YouTube: యూట్యూబ్‌లో ఆటో డిలీట్ హిస్టరీ..ఎనేబుల్ చేశారా?

యూట్యూబ్‌లో మనం హిస్టరీ డిలీట్ చేయడం మరిచిపోయినా.. దానంతటదే డిలీట్ అయ్యేలా ఆటో డిలీట్‌ ఫీచర్‌ ఉంది. అయితే ఈ ఫీచర్‌ను ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం..

Published : 02 Jun 2022 22:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెబ్‌ విహారం తర్వాత చాలా మంది యూజర్లు తప్పకుండా హిస్టరీ డిలీట్ చేస్తుంటారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి హిస్టరీ డిలీట్ చేయడం వల్ల బ్రౌజర్‌పై భారం తగ్గుతుంది. రెండోది వెబ్‌ విహారంలో మనం ఏయే వెబ్‌సైట్లు చూశామనేది ఇతరులకు తెలియదు. అంతేకాకుండా కొన్ని థర్డ్‌-పార్టీ యాప్‌లు, బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లు సదరు డేటాను ప్రకటనల కోసం ఉపయోగిస్తుంటాయి కూడా. అయితే బ్రౌజింగ్ హిస్టరీ అనేది వెబ్ బ్రౌజర్లకు మాత్రమే కాదు.. యూట్యూబ్‌ వంటి వీడియో ఫ్లాట్‌ఫామ్‌లకు కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏమరపాటుతోనో, తొందరపాటు వల్లనో హిస్టరీని డిలీట్ చేయడం మరిచిపోతుంటాం. దీంతో మన తర్వాత ఇతరులు ఎవరైనా యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి అందులో ఏమేం చూశామనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్‌లో మనం హిస్టరీ డిలీట్ చేయడం మరిచిపోయినా.. దానంతటదే డిలీట్ అయ్యేలా ఆటో డిలీట్‌ ఫీచర్‌ ఉంది. అయితే ఈ ఫీచర్‌ను ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం.

* కంప్యూటర్‌/పీసీలో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసిన తర్వాత లోగో పక్కనే ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. తర్వాత మెనూలో హిస్టరీ (History) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మేనేజ్‌ ఆల్ హిస్టరీ (Manage All History) అనే ఆప్షన్‌ ఓపెన్ చేయాలి. 

* అందులో ఆటో డిలీట్‌ (Auto Delete) అనే సెక్షన్ ఓపెన్ చేస్తే ఆటో డిలీట్ యాక్టివిటీ (Auto Delete Activity), డోన్ట్‌ ఆటో డిలీట్ యాక్టివిటీ (Don't Auto Delete Activity) అని రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఆటో డిలీట్‌ యాక్టివిటీపై క్లిక్ చేస్తే 3 నెలలు, 18 నెలలు, 36 నెలలు ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిన టైమ్‌ పీరియడ్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే.. ఎప్పటికప్పుడు మీ యూట్యూబ్ హిస్టరీ ఆటోమేటిగ్గా ఆ సమయంలోగా డిలీట్ అవుతుంది. 

* మొబైల్‌లో అయితే యూట్యాబ్ యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత లైబ్రరీలోకి వెళితే హిస్టరీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేస్తే హిస్టరీ కంట్రోల్స్‌ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మేనేజ్‌ ఆల్ యాక్టివిటీలోకి వెళితే ఆటో డిలీట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. తర్వాత పైన పేర్కొన్న విధానంలో ఆటో డిలీట్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేస్తే యాప్‌లో కూడా హిస్టరీ ఆటో డిలీట్ అయిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని