Laptop: ల్యాప్‌టాప్‌ మూసినా డిస్‌ప్లే ఆన్‌లో ఉండాలా.. అయితే ఇలా చేయండి!

ల్యాప్‌టాప్‌ స్క్రీన్ లిడ్ మూసినా డిస్‌ప్లే ఆన్‌లో ఉంటుందని తెలుసా? అదేంటీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా?ఇందుకోసం ల్యాప్‌టాప్‌ కంట్రోల్‌ ప్యానల్‌లోని పవర్‌ ఆప్షన్స్‌లో చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.

Published : 13 Jun 2022 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లేకు కనెక్ట్‌ చేసి... ల్యాప్‌టాప్‌ (Laptop) స్క్రీన్‌ మూసేసినా ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లేను ఆన్‌లోనే ఉంచొచ్చు తెలుసా? అదేంటి ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉండి స్క్రీన్‌ లిడ్ మూసివేస్తే స్లీప్ మోడ్‌లోకి వెళ్తుంది కదా అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ లిడ్ మూసినా డిస్‌ప్లే ఆన్‌లోనే ఉంచొచ్చు. దీని కోసం ల్యాప్‌టాప్‌ కంట్రోల్‌ ప్యానల్‌లోని పవర్‌ ఆప్షన్స్‌లో చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.


విండోస్‌

  • విండోస్‌లో కంట్రోల్‌ ప్యానల్‌ (Control Panel) ఓపెన్ చేసి సెర్చ్‌ ఆప్షన్‌లో పవర్‌ అని టైప్ చేస్తే పవర్‌ ఆప్షన్స్‌ (Power Options) కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే ఎడమవైపు చూజ్‌ వాట్ క్లోజింగ్ ది లిడ్ డజ్‌ (Choose What Closing The Lid Does) ఆప్షన్‌ ఉంటుంది.
  • ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి పవర్‌ అండ్ స్లీప్‌ బటన్స్‌ అండ్ లిడ్‌ సెట్టింగ్స్‌ (Power and Sleep Buttons and Lif Settings)లో వెన్‌ ఐ చూజ్‌ ది లిడ్‌ (When I Choose The Lid) అనే సెక్షన్‌ ఉంటుంది.
  • అందులో డూ నథింగ్ (Do Nothing) ఆప్షన్‌ సెలెక్ట్ చేసి సేవ్‌ ఛేంజెస్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ లిడ్ ఎప్పుడు మూసినా డిస్‌ప్లే ఆన్‌లోనే ఉంటుంది. 

మ్యాక్‌ బుక్‌

  • మ్యాక్‌బుక్‌లో ఎడమవైపు పైభాగంలో ఉన్న యాపిల్ ఐకాన్‌పై క్లిక్ చేసి సిస్టమ్‌ ప్రిఫరెన్స్‌స్‌పై క్లిక్ చేస్తే బ్యాటరీ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఎడమవైపు పవర్‌ అడాప్టర్‌ ట్యాబ్‌ ఉంటుంది. 
  • దానిపై క్లిక్ చేస్తే టర్న్‌ డిస్‌ప్లే ఆఫ్‌ ఆఫ్టర్‌ (Turn Display Off After) సెక్షన్‌ కనిపిస్తుంది. అందులో స్లైడర్‌ బార్‌ను నెవర్‌ (Never) అని కనిపిచేంత వరకు చివరకు డ్రాగ్ చేయాలి.
  • తర్వాత ప్రివెంట్ కంప్యూటర్‌ ఫ్రమ్‌ స్లీపింగ్‌ ఆటోమేటికల్లి వెన్‌ ది డిస్‌ప్లే ఈజ్‌ ఆఫ్‌ (Prevent Computer From Sleeping Automatically When The Display is Off) ఆప్షన్‌ను అన్‌సెలక్ట్ చేసి మ్యాక్‌ బుక్‌ను ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లేకు కనెక్ట్ చేస్తే స్క్రీన్‌ లిడ్ మూసినా డిస్‌ప్లే ఆన్‌లోనే ఉంటుంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని