Instagram: ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇతరులను ఎలా ట్యాగ్ చేయాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఫొటో/వీడియోలకు ఇతరులను ఎలా ట్యాగ్‌ చేయొచ్చు. దాని వల్ల మీరు వారిని స్టోరీస్‌లో ట్యాగ్‌ చేసినట్లు వారికి పుష్‌ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మరి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇతరులను ఎలా ట్యాగ్‌ చేయాలో తెలుసుకుందాం. 

Published : 21 Mar 2022 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాలు, ఫోన్‌ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక జీవితంలో ముఖ్యమైన ప్రతి సందర్భాన్ని ఇతరులతో పంచుకుంటోంది నేటితరం. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో ఫొటో/వీడియోలతో స్టోరీలను (Stories) షేర్‌ చేయడం సర్వసాధారణం. అయితే 24 గంటల తర్వాత అవి ప్రొఫైల్‌ గ్రిడ్‌లో కనిపించవు.

ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసే ఫొటోలు/ వీడియోలలో స్నేహితుల ఎవరైనా ఉంటే వారిని ట్యాగ్‌ చేయొచ్చు. అలా చేయడం వల్ల మీరు వారిని స్టోరీస్‌లో ట్యాగ్‌ చేసినట్లు వారికి పుష్‌ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు స్టోరీస్‌ చూడమని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మీ ఖాతా నుంచి వారికి  డైరెక్ట్ మెసేజ్‌ వెళుతుంది. అలానే మీ స్టోరీస్‌ చూసే వ్యక్తులు మీరు ట్యాగ్‌ చేసిన వ్యక్తుల ప్రొఫైల్‌ను కూడా చూడొచ్చు. మరి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇతరులను ఎలా ట్యాగ్‌ చేయాలి? ఒకేసారి ఎంత మంది ట్యాగ్‌ చేయొచ్చనేది తెలుసుకుందాం.

  • ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక ఫొటో/వీడియోకు ఒకేసారి పది మందిని ట్యాగ్ చేయొచ్చు. అలా మీరు ట్యాగ్‌ చేసిన ప్రతి ఒక్కరికీ వాళ్లని ట్యాగ్‌ చేసినట్లు మెసేజ్‌ వెళుతుంది.
  • ఇతరులను మీ ఇన్‌స్టా స్టోరీస్‌లో ట్యాగ్‌ చేసేందుకు మొబైల్‌ యాప్‌ల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి స్టోరీస్‌ రూపొందించాలి. ఇందుకోసం మొబైల్‌ స్క్రీన్‌ పై భాగంలో యువర్‌ స్టోరీ ఆప్షన్‌ లేదా మొబైల్‌ స్క్రీన్‌ను కుడివైపు స్వైప్‌ చేసి ఫొటో/వీడియోను అప్‌లోడ్‌ చేయాలి.
  • మీరు అప్‌లోడ్ చేసిన వాటిలో ఏ ఫొటో/వీడియోలో ఇతరులను ట్యాగ్‌ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి @UserName టైప్‌ చేసి వారిని సెలెక్ట్ చేసి ఓకే చేసి, సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత మీరు ట్యాగ్‌ చేసిన వారికి మెసేజ్‌ వెళుతుంది. ఒకవేళ స్టోరీస్‌ను షేర్‌ చేసేందుకు నెక్ట్స్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి షేర్‌ చేస్తే సరిపోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని