Google Chrome: క్రోమ్‌ బ్రౌజర్‌లో ఫొటో రీసైజింగ్‌.. ఎలా చేయొచ్చంటే?

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ఫొటో సైజ్‌ను ఎడిటింగ్‌ టూల్స్‌ ఉపయోగించకుండా గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఫొటో సైజ్‌లో మార్పులు చేయొచ్చు. అదెలానో తెలుసుకుందాం.

Updated : 04 Jan 2022 14:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతంలో పరీక్ష లేదా ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎంతో పేపర్ వర్క్‌ చేయాల్సిందే. పెన్‌తో అప్లికేషన్ పూర్తి చేసి, ఫొటో అంటించి, అటాచ్‌ చేయాల్సిన ఫైల్స్‌ జిరాక్స్ తీసి పిన్‌ చేసి పోస్ట్ లేదా కొరియర్‌లో పంపేవాళ్లం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్‌లోనే అన్ని అయిపోతున్నాయి. కూర్చున్న చోటు నుంచే బ్రౌజర్‌లో వెబ్‌సైట్ ఓపెన్‌ చేసి అప్లికేషన్ సబ్‌మిట్ చేస్తున్నాం. 

ఈ క్రమంలోనే మనం అప్‌లోడ్ చేసే ఫొటో సైజ్‌ ఎక్కువగా ఉంటే అప్‌లోడ్ కాదు. దీంతో ఫొటో సైజ్‌ తగ్గించేందుకు ఇమేజ్‌ ఎడిటర్‌ టూల్స్‌ను ఆశ్రయిస్తాం. దీనివల్ల సమయం వృథా. అదే క్రోమ్ బ్రౌజర్‌లోనే ఫొటో సైజ్‌ తగ్గించే ఆప్షన్ ఉంటే.. అప్లికేషన్ ప్రక్రియ మరింత సులువుగా పూర్తవుతుంది కదా. మరి క్రోమ్ బ్రౌజర్‌లో ఇమేజ్‌ సైజ్ ఎలా తగ్గించాలో తెలుసుకుందాం.  

💻 కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ ఓపెన్ వెబ్‌స్టోర్‌ (https://chrome.google.com/webstore)కు వెళ్లి సెర్చ్‌ బార్‌లో రీసైజింగ్‌ యాప్‌ (Resizing App) అని టైప్ చేయాలి. 

💻 సెర్చ్‌ రిజల్ట్‌లో రీసైజింగ్ యాప్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పక్కనే యాడ్‌ టు క్రోమ్‌ (Add To Chrome) ఆప్షన్‌ కనిపిస్తుంది. 

💻 దానిపై క్లిక్ చేస్తే రీసైజింగ్ యాప్ ఎక్స్‌టెన్షన్‌ క్రోమ్ బ్రౌజర్‌కు యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఎక్స్‌టెన్షన్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే మీరు రీసైజ్ చేయాలనుకుంటున్న ఫొటో అప్‌లోడ్ చేయమని కోరుతూ ప్లస్‌ సింబల్‌తో కూడిన పాప్‌-అప్‌ విండో ఓపెన్ అవుతుంది. 

💻 అందులో ఫొటో అప్‌లోడ్ చేసి మీకు నచ్చిన సైజ్‌లోకి మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఈ ఎక్స్‌టెన్షన్ పనిచేస్తుంది. దీనివల్ల ఇతర ఫొటో ఎడిటింగ్ టూల్స్‌ఫై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని