WhatsApp: మీ గ్రూప్ ఇన్వైట్ లింక్ లీకైందా?
మెసేజింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక తమకు నచ్చిన వారితో గ్రూప్ క్రియేట్ చేసి అనేక అంశాల గురించి చర్చించుకుంటారు. ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోలిస్తే వాట్సాప్‌లో సులభంగా గ్రూప్ క్రియేట్ చేసి నచ్చిన వారిని అందులో చేరమని ఆహ్వానించవచ్చు లేదా మీకు ఇతరుల నుంచి ఆహ్వానం అందితే గ్రూపులో చేరవచ్చు...
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్ చేయడం సులువు. మనకు నచ్చిన వారిని చేర్చొచ్చు. లేదంటే ఇన్వైట్ లింక్ ద్వారా గ్రూప్‌లోకి ఆహ్వానించొచ్చు. అలా కొన్నిసార్లు మనం పంపే ఇన్వైట్ లింక్ మనకు పరిచయం లేని వ్యక్తులకు కూడా చేరిపోతుంటుంది. దీంతో గుర్తు తెలీని వ్యక్తులు మన గ్రూపుల్లో చేరిపోతుంటారు. దీనివల్ల గ్రూప్ ప్రైవసీకి భంగం కలగడమే కాకుండా అడ్మిన్‌కు కొత్త చికాకులు ఎదురవుతాయి. గ్రూప్‌లో చేరే వారిని ఆపుదామంటే అప్పటికే ఇన్వైట్ లింక్ ఇతరులకు షేర్ అయిపోయి ఉంటుంది. అలా అని గ్రూప్‌ను సస్పెండ్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గ్రూప్‌లో కొత్తవారు చేరకుండా నియంత్రించేందుకు వాట్సాప్‌లో ఓ ఫీచర్ అందుబాటులో ఉంది. అదే రీసెట్ లింక్ ఆప్షన్. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* గ్రూప్ ఇన్వైట్ లింక్‌ని రీసెట్ చేసేందుకు కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.
* ముందుగా మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్ ఓపెన్ చేసి అందులో గ్రూప్ ఇన్ఫోపై క్లిక్ చేయాలి. తర్వాత ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో రీసెట్ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ పాత లింక్‌కి
బదులు కొత్త లింక్ క్రియేట్ అవుతుంది.
* దాంతో పాత లింక్‌తో కొత్త వారెవరూ గ్రూప్‌లో చేరలేరు. ఒకవేళ కొత్తగా ఎవరినైనా గ్రూప్‌లోకి ఆహ్వానించాలంటే కొత్త లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్‌తో కాకుండా యాడ్ పార్టిస్‌పెంట్ ద్వారా కూడా గ్రూప్‌లో కొత్త వారిని చేర్చుకోవడం ఎప్పటికీ ఉత్తమం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
-
Sports News
Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల