Gmail: జీమెయిల్‌లో ఎక్స్‌పైరీ డేట్ ఫీచర్‌.. ఎలా ఉపయోగించాలంటే?

జీమెయిల్‌లో మనం పంపే మెయిల్స్‌ బయటివారు చదవకుండా.. వాటిని కాపీ, ప్రింట్‌, ఫార్వార్డ్, స్క్రీన్‌షాట్, డౌన్‌లోడ్ చేయకుండా ఉండేందుకు ఒక ఆప్షన్ ఉంది. అదే కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌. మరి ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

Published : 14 Jan 2022 18:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంవ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్ వేర్వేరు అవసరాల కోసం జీమెయిల్‌ (Gamil)ను ఉపయోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు జీమెయిల్‌ ద్వారా మనం పంపే ముఖ్యమైన సమాచారం అనుకోకుండా చేసే పొరపాట్ల వల్ల బయటివారికి చేరిపోతుంది. దాంతో సీక్రెట్‌ లేదా కాన్ఫిడెన్షియల్ అనుకున్న సమాచారం కాస్తా బహిర్గతమవుతుంది. అలాకాకుండా మనం పంపే సమాచారాన్ని కాపీ, ప్రింట్‌, ఫార్వార్డ్, స్క్రీన్‌షాట్, డౌన్‌లోడ్ చేయకుండా ఉండేందుకు జీమెయిల్‌లో కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ (Confidential Mode) అనే ఫీచర్‌ ఉంది. మరి ఈ ఫీచర్‌ను ఐఫోన్‌, ఆండ్రాయిడ్, ఐపాడ్, డెస్క్‌టాప్‌లలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. 


డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో 

📩 వెబ్‌ బ్రౌజర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి కంపోజ్‌ (Compose +) పై క్లిక్ చేయాలి. కంపోజ్ విండో ఓపెన్ అయిన తర్వాత కింద సెండ్ (Send) బటన్‌  పక్కన ఐకాన్స్‌ కనిపిస్తాయి. 

📩 వాటిలో లాక్‌, గడియారం సింబల్‌ ఉన్న ఐకాన్‌ ఉంటుంది. అదే కాన్ఫిడెన్షియల్ మోడ్‌. దానిపై క్లిక్ చేస్తే పాప్‌-అప్‌ విండో ఓపెన్ అవుతుంది. 

📩 అందులో ఎక్స్‌పైరేషన్‌ డేట్‌ (Expiration Date), ఎస్‌ఎమ్‌ఎస్‌ పాస్‌కోడ్ (SMS Passcode) అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఎక్స్‌పైరేషన్‌లో రోజు, వారం, నెల, మూడు నెలలు, ఐదేళ్లు వంటి ఆప్షన్లు ఉంటాయి. 

📩 మీరు పంపిన మెయిల్ ఎప్పటిలోగా డిలీట్‌ అయిపోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగా ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.  

📩 పాస్‌కోడ్ ఆప్షన్‌ సెలెక్ట్ చేసి జీమెయిల్ ఉపయోగించని యూజర్స్‌ మెయిల్ పంపితే దాన్ని ఓపెన్ చేసేందుకు వారికి గూగుల్ నుంచి ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుంది. ఇందుకోసం మీరు ఎవరికైతే మెయిల్ పంపుతున్నారో వారి మొబైల్ నంబర్‌ టైప్‌ చేయాలి.

📩 ఒకవేళ పాస్‌కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫోన్ నంబర్‌ టైప్ చెయ్యకపోతే మెయిల్ ఓపెన్ కాదు. దాన్ని ఎంటర్‌ చేస్తేనే మెయిల్ ఓపెన్ అవుతుంది. జీమెయిల్ యూజర్స్‌కు ఈ పాస్‌కోడ్ అవసరంలేదు.


ఐఓఎస్‌, ఆండ్రాయిడ్

📩 ఐఫోన్, ఐపాడ్, ఆండ్రాయిడ్ ఫోన్‌ లేదా ట్యాబ్‌లో జీమెయిల్ యాప్‌ ఓపెన్ చేసి కంపోజ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కంపోజ్‌ మెయిల్‌ విండోలో కుడివైపు పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేస్తే కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ ఆప్షన్ కనిపిస్తుంది. 

📩 దాన్ని ఎనేబుల్ చేస్తే ఎక్స్‌పైరేషన్‌, పాస్‌కోడ్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌ ఉపయోగించి మెయిల్ పంపవచ్చు.


వద్దంటే చూడలేరు

📩 మీరు పంపిన మెయిల్‌లో తప్పులున్నా, ఇతరత్రా కారణాలతో అవతలి వ్యక్తి సదరు మెయిల్‌ను చూడకూడదనుకుంటే ఇలా చేయండి. జీమెయిల్‌లో సెంట్‌ (Sent) ఆప్షన్‌లోకి వెళ్లి మీరు కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌లో పంపిన మెయిల్‌పై క్లిక్‌ చేస్తే రిమూవ్ యాక్సెస్‌ (Remove Access) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

📩 దానిపై క్లిక్ చేయాలి. దాంతో మీరు పంపిన మెయిల్‌ను అవతలి వ్యక్తి ఓపెన్‌ చేసినా అందులోని సమాచారాన్ని చూడలేరు. మెయిల్‌ను చూసేందుకు అనుమతిలేదు అనే మెసేజ్‌ కనిపిస్తుంది. 

📩 ఒకవేళ మీరు తిరిగి మెయిల్‌ యాక్సెస్‌కు అనుమతించాలనుకుంటే రెన్యూ యాక్సెస్ (Renew Access)పై క్లిక్ చేయాలి. దాంతో అవతలి వ్యక్తి మెయిల్‌ను ఓపెన్ చేసి అందులోని సమాచారం చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు