Published : 30 Nov 2021 11:48 IST

WhatsApp: ఈ చిన్న ట్రిక్‌తో నంబర్‌ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ పంపాలంటే వారి నంబర్‌ మన కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్‌ చేసుకోవాల్సిందే. ఒక్కోసారి జిరాక్స్‌ షాప్‌కు వెళ్లినప్పుడో, వెరిఫికేషన్‌ కోసం ఏదైనా డాక్యుమెంట్ పంపాల్సినప్పుడో అవతలి వ్యక్తికి వాట్సాప్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో నంబర్‌ సేవ్‌ చేయాల్సిందే. నిజానికి ఆ సమయంలో తప్ప వారి నంబర్‌ మనకు పెద్దగా అవసరం ఉండదు. అయినా సేవ్‌ చేసుకోవడం వల్ల మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండిపోతుంది. దీంతో అవసరంలేని నంబర్లతో మన కాంటాక్ట్ లిస్ట్ నిండిపోతుంది. దీంతో పనిగట్టుకుని అవసరంలేని నంబర్లను కాంటాక్ట్ జాబితా నుంచి డిలీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నంబర్‌ సేవ్‌ చేసుకోకుండా వాట్సాప్‌ నుంచి పంపగలితే? అదెలా సాధ్యమనేగా మీ సందేహం? అయితే ఈ చిన్న ట్రిక్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.

* నంబర్‌ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ మెసేజ్‌ పంపేందుకు మీ మొబైల్‌లో ట్రూకాలర్‌ యాప్‌ ఉండాలి.

* మీరు ఎవరికైతే వాట్సాప్‌ మెసేజ్‌ పంపాలనుకుంటున్నారో వారి నంబర్‌ను మీ ఫోన్‌లో డయల్‌ చేయాలి. తర్వాత ట్రూకాలర్‌ యాప్‌లోకి వెళ్లి సదరు నంబర్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే వాట్సాప్ ఆప్షన్‌ కనిపిస్తుంది.

* దానిపై క్లిక్ చేస్తే ఆ నంబర్‌ వాట్సాప్ ఛాట్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వారికి మెసేజ్ చేయొచ్చు. అలా మీరు నంబర్‌ చేసుకోకుండానే ఇతరులకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపొచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని