Youtube: యూట్యూబ్‌ వీడియోలో నచ్చిన భాగాన్నే షేర్‌ చేయాలంటే?

యూట్యూబ్‌లో మనం చూసే వీడియోల్లో నచ్చిన భాగాన్ని ఇతరులో ఎలా షేర్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకు రెండు పద్ధతులున్నాయి. 

Published : 02 Jan 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌లో ఏదైనా వీడియో నచ్చితే... స్నేహితులకు షేర్ చేస్తుంటాం. ఒకవేళ అందులో ఫలానా టైమ్‌ దగ్గర చూడు... బాగుంది అని చెప్పాలంటే, ఆ సమయం మెసేజ్‌లో మెన్షన్‌ చేస్తాం. కానీ, చాప్టర్ ఫీచర్‌ ద్వారా ఈ పని సులభంగా చేయొచ్చు. అయితే దీన్ని ఆ వీడియో క్రియేటర్స్‌ ముందుగా రెడీ చేయాలి. అలా కాకుండా వీడియోలో మనకు నచ్చిన పార్ట్‌ను మాత్రమే ఎలా షేర్ చేయాలో తెలుసా? ఇందుకు రెండు పద్ధతులున్నాయి. టైమ్‌ స్టాంప్‌ ఆప్షన్‌తో యూట్యూబ్‌ షేర్ చేయడం ఒకటైతే, రెండోది యూట్యూబ్‌ యూఆర్‌ఎల్‌ ద్వారా షేర్‌ చేయడం.


షేర్ ఫీచర్‌తో 

* డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌లో యూట్యూబ్‌లో మీరు షేర్ చేయాలనుకుంటున్న వీడియోను ఓపెన్‌ చేయాలి. అందులో మీరు ఎక్కడి నుంచి పంపాలనుకుంటున్నారో ఆ టైమ్‌ లైన్‌ వద్ద వీడియోను పాజ్‌ చేయాలి.

* షేర్ బటన్‌పై క్లిక్‌ చేస్తే పాప్‌-అప్‌ విండో ఓపెన్ అవుతుంది. అందులో యూఆర్‌ఎల్‌ కింద స్టార్ట్ ఎట్‌ (Start At) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేస్తే యూట్యూబ్‌ యూఆర్‌ఎల్‌ పక్కన t= అని యాడ్‌ అయ్యి ఆ సెకన్లు వస్తాయి. ఉదాహరణకు 55 సెకన్ల దగ్గర పాజ్‌ కొట్టి ఉంటే... అక్కడ 55 అని సమయం వస్తుంది.

* ఆ యూఆర్‌ఎల్‌ను కాపీ చేసి మీరు ఇతరులతో షేర్ చేస్తే సరిపోతుంది. వాళ్లు ఆ లింక్‌పై క్లిక్ చేస్తే వీడియో మొత్తం కాకుండా మీరు సెలెక్ట్‌ చేసిన దగ్గర్నుంచి ప్లే అవుతుంది.  


వీడియో యూఆర్‌ఎల్‌తో...

* యూట్యూబ్‌లో మీరు షేర్ చేయాలనుకుంటున్న డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌లో వీడియోను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యూఆర్‌ఎల్‌ ఆఖరున &t= అని యాడ్‌ చేయాలి. దాని పక్కన మీరు షేర్‌ చేయాలనుకుంటున్న సమయం యాడ్‌ చేయాలి. ఆ తర్వాత దాన్ని షేర్‌ చేసుకోవచ్చు. అప్పుడు పైన చెప్పిన విధంగా అవతలి వ్యక్తి మీరు పంపిన చోటు నుంచే ఆ వీడియో చూడొచ్చు. 

* యూట్యూబ్‌లో రెండు రకాల యూఆర్‌ఎల్స్‌ కనిపిస్తుంటాయి. ఒకటి ఫుల్‌ యూఆర్‌ఎల్‌ అయితే, రెండో షార్ట్‌ కట్‌ యూఆర్‌ఎల్‌. ఒక్కోదాని విషయంలో ఒక్కోలా యాడింగ్‌ చేయాల్సి ఉంటుంది. 

* మీ యూఆర్‌ఎల్‌ https://youtu.be/wQW3olmx3w4 ఇలా షార్ట్‌ కట్‌ (youtu.be) దానిని https://youtu.be/wQW3olmx3w4?t=55sగా మార్చాలి. అంటే మీరు కొత్తగా యాడ్‌ చేసిన దానికి ?t=55s అనేది ఆ సమయం సూచిస్తుందన్నమాట.

* ఒకవేళ ఫుల్‌గా ఉంటే... దానికి &t=1h15m25s అని గంటలు, నిమిషాలు, సెకన్లలో మీకు కావాల్సిన సమయం యాడ్‌ చేయాలి. మీ యూఆర్‌ఎల్‌ https://www.youtube.com/watch?v=Docq4EKQ4V4 అయితే... అప్పుడు ఆ యూఆర్‌ఎల్‌ https://www.youtube.com/watch?v=Docq4EKQ4V4&t=1h00m25sగా మారుతుంది. 


మొబైల్ యాప్‌ ద్వారా...

* యాప్‌ ద్వారా అయితే వీడియో ఓపెన్ చేసి అందులో షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో మీకు కాపీ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి లింక్‌ కాపీ చేసి చివరన t=100s (సెకన్లు) లేదా t=3m55s (నిమిషాలు, సెకన్లు) యాడ్‌ చేయాలి. లేదంటే  లింక్‌ చివరన &t=3m55s యాడ్ చేసి వీడియోలను షేర్‌ చేయొచ్చు. ఒకవేళ మొబైల్‌ బ్రౌజర్‌లో అయితే... పైన చెప్పినట్లు డెస్క్‌టాప్‌ తరహాలో షేర్‌ చేయొచ్చు.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని