WhatsApp: విసిగించే నోటిఫికేషన్లకు విరుగుడు

వాట్సాప్‌ యాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదంటే నమ్మశక్యం కాదు. చిన్న శబ్దం వచ్చినా సరే మెసేజ్‌ వచ్చిందేమోనని చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడంతా...

Updated : 11 Jul 2021 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదంటే నమ్మశక్యం కాదు. చిన్న శబ్దం వచ్చినా సరే మెసేజ్‌ వచ్చిందేమోనని చాలా మంది చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడంతా వర్క్‌ ఫ్రం హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాస్‌లు.. దీంతో వాట్సాప్‌ వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. అయితే భారీగా వచ్చే వాట్సాప్‌ నోటిఫికేషన్లతో చిరాకు వచ్చేస్తోందని పలువురు వాపోతుంటారు. మరి ఇలాంటి నోటిఫికేషన్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లలో రాకుండా, మళ్లీ కావాల్సినప్పుడు వచ్చేలా ఏం చేయాలో తెలుసుకుందాం!

చాలా సింపుల్‌గా ఇలా..

ఆండ్రాయిడ్‌ యూజర్‌ అయితే మీ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి.

నోటిఫికేషన్‌ సెక్షన్‌ క్లిక్‌ చేయాలి

అందులో వాట్సాప్‌నకు ఎదురుగా ఉండే బాక్స్‌ను ఆఫ్‌ చేసేయండి

నోటిఫికేషన్స్‌ రావాలంటే మళ్లీ సెట్టింగ్స్‌ క్లిక్‌ చేసి నోటిఫికేషన్‌ సెక్షన్‌కు వెళ్లి వాట్సాప్‌ను ఎనేబుల్‌ చేసేయడమే..

 నోటిఫికేషన్స్‌ రావాలంటే మళ్లీ ఎనేబుల్‌ చేస్తే సరిపోతుంది

 ఐఓఎస్‌లోనూ..

ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి.

 నోటిఫికేషన్స్‌ క్లిక్‌ చేయాలి

 ALLOW నోటిఫికేషన్స్‌ను డిజేబుల్‌ చేసేయాలి

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇది మరొక మార్గం..

ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్‌ యాప్ మీద క్లిక్‌ చేయండి

యాప్‌ ఇన్‌ఫో ఓపెన్ చేయాలి.

☞ ఇందులో నోటిఫికేషన్స్‌ సెక్షన్‌ క్లిక్‌ చేసేయండి.

షో నోటిఫికేషన్స్‌ను ఆఫ్‌ చేయండి.

దీంతో మీ వాట్సాప్‌నకు వచ్చే మెసేజ్‌ నోటిఫికేషన్లు కనిపించవు.

తీరిక వేళల్లో మీ వాట్సాప్‌ను ఓపెన్ చేసుకుని మెసేజ్‌లను చదువుకోవచ్చు.

మళ్లీ నోటిఫికేషన్లు రావాలంటే.. వాట్సాప్‌ మీద క్లిక్‌ చేసి యాప్‌ ఇన్‌ఫో ఓపెన్‌ చేయాలి.

నోటిఫికేషన్స్ సెక్షన్‌కు వెళ్లి ఆన్‌ చేసేయడమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని