Smartphone Unlock: ప్యాట్రన్‌, లాక్‌ మరచిపోతే... అన్‌లాక్‌ ఇలా!

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్లు మనుషులకు నమ్మకమైనవిగా మారిపోయాయి. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు ఎంతో ముఖ్యమైన డేటాను ఫోన్‌లో భద్రపరుస్తున్నాం. అందుకే ఇతరులెవరూ ఫోన్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా వివిధ రకాల లాకింగ్ సిస్టమ్స్‌తో రక్షణ కల్పిస్తుంటాం.

Updated : 23 Jul 2021 12:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్లు మనుషులకు నమ్మకమైనవిగా మారిపోయాయి. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు ఎంతో ముఖ్యమైన డేటాను ఫోన్‌లో భద్రపరుస్తున్నాం. అందుకే ఇతరులెవరూ ఫోన్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా వివిధ రకాల లాకింగ్ సిస్టమ్స్‌తో రక్షణ కల్పిస్తుంటాం. అయితే ఈ లాక్‌ ప్యాట్రన్‌లు మరచిపోయినా, పొరపాటున లాకింగ్ సిస్టం బ్లాక్ అయినా దాన్ని ఓపెన్ చేయడం సులువుగా అయ్యేపని కాదు. కానీ ఫోన్‌ను ఉపయోగించాలంటే దాన్ని అన్‌లాక్ చేయాల్సిందే. ఫోన్ లాక్ అయినప్పుడు ఏం చేయాలి?దాన్ని ఎలా అన్‌లాక్ చేయాలో చూద్దాం.

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్‌ (ఏడీఎం)

ఈ పద్ధతిలో ఫోన్ అన్‌లాక్ అయ్యేందుకు ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘ఫైండ్‌ మై డివైజ్’ అనే ఫీచర్‌ను ఎనేబుల్ చేసివుండాలి. అలానే ఈ ప్రక్రియ ద్వారా ఫోన్‌ని అన్‌లాక్ చేస్తే అందులోని డేటా మొత్తం డిలీట్‌ అయిపోతుంది. ముందుగా గూగుల్ సెర్చ్‌ ఇంజిన్ ఓపెన్ చేసి ఫైండ్ మై డివైజ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అలానే మీ కంప్యూటర్‌లో కూడా ఫోన్‌లో లాగిన్ అయిన గూగుల్ ఖాతాతో లాగిన్‌ కావాలి. తర్వాత ఫైండ్ మై డివైజ్‌ వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ లొకేషన్‌తో పాటు ఎరేజ్ డివైజ్ అనే అప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎరేజ్ ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత మీ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసుకుని రీస్టార్ట్ అవుతుంది. అలా మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయొచ్చు.

గూగుల్ ఖాతాతో ఎలాగంటే? 

మీ ఫోన్ లాక్ ప్యాట్రన్‌ మరచిపోతే ఐదుసార్లు తప్పుగా ప్యాట్రన్‌ను ప్రయత్నించాలి. తర్వాత ఫర్‌గాట్ ప్యాట్రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ గూగుల్ ఖాతాలో లాగిన్ చేయమని సూచిస్తుంది.  మీ గూగుల్ ఖాతా వివరాలు టైప్ చేసిన తర్వాత మీకు ఫోన్ లాక్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మీ ఫోన్‌కి కొత్త లాక్‌ ప్యాట్రన్ పెట్టుకుంటే సరిపోతుంది. 

డ్రాయిడ్‌కిట్‌ (Droidkit) సాయం తీసుకోండి..

పై రెండు పద్ధతులే కాకుండా ఐమొబే డ్రాయిడ్‌కిట్‌ ద్వారా కూడా అన్‌లాక్‌ చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ టూల్ సాయంతో ఫోన్‌ని అన్‌లాక్ చేయడం ఎంతో సులభం. ఇది అన్ని రకాల ఆండ్రాయిడ్ స్క్రీన్‌ లాక్స్‌, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, లాక్ ప్యాట్రన్లు, ఫింగర్‌ప్రింట్ ఐడీ, ఫేస్ రికగ్నిషన్‌లను తొలగించేందుకు సాయపడుతుంది. అలానే 20 వేలకు పైగా ఆండ్రాయిడ్ మోడల్స్‌ని ఈ టూల్ సపోర్ట్ చేస్తుంది. ఫైండ్‌ మై డివైజ్ తరహాలోనే ఈ పద్ధతిలో కూడా ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ అవుతుంది. 

* ముందుగా మీ ఫోన్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. తర్వాత గూగుల్‌లో డ్రాయిడ్‌కిట్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోమని సూచిస్తుంది.

* సాఫ్ట్‌వేర్ మీ కంప్యూటర్‌లో రన్ చేశాక.. విండోలో కుడివైపు అన్‌లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది. 

* అందులో స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కాన్ఫిగరేషన్ ఫైల్స్ పేజ్‌లో రిమూవ్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఫోన్ కంపెనీల జాబితా చూపిస్తుంది. 

* మీ ఫోన్ కంపెనీని సెలెక్ట్ చేసి నెక్ట్స్‌ క్లిక్ చేయాలి. తర్వాత  స్క్రీన్ మీద కనిపించే సూచనలను జాగ్రత్తగా అనుసరిస్తే  కొద్దిసేపటి తర్వాత మీ ఫోన్ స్క్రీన్ అన్‌లాక్ అవుతుంది. 

ఫోన్ అన్‌లాక్‌తోపాటు ఈ సాఫ్ట్‌వేర్ మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లనూ అందిస్తుంది. డేటా రికవరీ, శాంసంగ్‌ ఎఫ్‌ఆర్‌పీ లాక్‌, ఆప్టిమైజింగ్ సిస్టం ఫర్‌ బెటర్ ఫెర్ఫామెన్స్ వంటి ఫీచర్లు డ్రాయిడ్‌కిట్‌లో ఉన్నాయి. ఈ సాఫ్ట్‌వేర్ మ్యాక్‌, విండోస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇది ఉచితం కాదు. దీనికోసం సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి. వేర్వేరు ప్లాన్లు అందుబాటులోఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని