BGMI: డేటా రక్షణపై క్రాఫ్టన్‌ వివరణ

పబ్‌జీ ఇండియన్‌ వెర్షన్‌ ‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా’ కొన్ని రోజుల కిందట ఓ వివాదానికి కేంద్రబిందువు అయింది. ఆన్‌లైన్ గేమింగ్‌ యాప్‌ తన ప్లేయర్స్‌ డేటాను చైనాలోని సర్వర్‌కు పంపుతుందని ఐజీఎన్‌ రిపోర్ట్‌ వెల్లడించడంతో...

Published : 23 Jun 2021 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పబ్‌జీ ఇండియన్‌ వెర్షన్‌ ‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా’ యూజర్ల డేటాకు సంబంధించి కొంతకాలంగా వివాదం నెలకొంది. ఆన్‌లైన్ గేమింగ్‌ యాప్‌ రూపొందించిన క్రాఫ్టన్‌ సంస్థ తన ప్లేయర్స్‌ డేటాను చైనాలోని సర్వర్‌తోపాటు మరికొన్నింటికి పంపుతోందని ఐజీఎన్‌ రిపోర్ట్‌ వెల్లడించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆ నివేదిక ప్రకారం.. హాంకాంగ్‌లోని టెన్సెట్‌ రన్‌ ప్రోక్సిమా బీటా, ముంబయి, యూఎస్‌, మాస్కోలోని మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ సర్వర్లకు డేటాను పంపిస్తున్నట్లు పేర్కొంది. అయితే దీనిపై క్రాఫ్టన్‌ వివరణ ఇచ్చింది.

‘‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా (బీజీఎంఐ) ప్రారంభ వెర్షన్‌కు సంబంధించి యూజర్ల డేటా అంశం వివాదాస్పదంగా మారడంపై పూర్తి అవగాహన ఉంది. ఇతర మొబైల్‌ యాప్స్‌, గేమ్స్‌ మాదిరిగానే ఈ గేమ్‌కు యూనిక్‌ ఫీచర్లను తీసుకొచ్చేందుకు థర్డ్‌ పార్టీ సేవలను తీసుకుంటుంటాం. ఇలాంటప్పుడు గేమ్‌కు సంబంధించిన డేటాను థర్డ్‌ పార్టీకి షేర్‌ చేయాల్సి ఉంటుంది. పబ్‌జీ మొబైల్‌ నుంచి బీజీఎంఐకి మార్చే సమయంలో కొంతమంది యూజర్ల డేటాను బదిలీ చేశాం. అయితే క్రాఫ్టన్‌ ప్రైవసీ పాలసీ పూర్తిగా యూజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్లేయర్ల డేటా నిర్వహణ, రక్షణకు కట్టుబడి ఉన్నాం’’ అని క్రాఫ్టన్‌ ప్రకటించింది. 

బ్యాటిల్‌గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా గేమ్ వెర్షన్‌కు సంబంధించి అప్‌డేట్‌ను క్రాఫ్టన్‌ సంస్థ రిలీజ్‌ చేసింది. ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ ద్వారా చైనీస్‌ సర్వర్లకు యూజర్ల డేటా బదిలీ కాకుండా ఇది నిరోధిస్తుందని క్రాఫ్టన్‌ పేర్కొంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని