BGMI Launch: కొత్త రివార్డు ఏంటో తెలుసా..? 

గేమింగ్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పబ్‌జీ ఇండియన్ వెర్షన్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (బీజీఎంఐ) ఎట్టకేలకు భారత్‌లో విడుదలయింది. గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని క్రాఫ్టన్‌ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ గేమ్‌ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉందని...

Published : 02 Jul 2021 23:44 IST

ఇంటర్నెట్‌డెస్క్: గేమింగ్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పబ్‌జీ ఇండియన్ వెర్షన్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (బీజీఎంఐ) ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని క్రాఫ్టన్‌ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ గేమ్‌ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉందని.. త్వరలోనే ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని క్రాఫ్టన్‌ సంస్థ తెలిపింది. ఇప్పటికే బీటా వెర్షన్ డౌన్‌లోడ్‌ చేసుకున్న యూజర్స్‌ ప్లేస్టోర్‌ నుంచి ప్రస్తుత వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ ప్లేస్టోర్‌ మొబైల్‌ యాప్‌లో అప్‌డేట్‌ ఆప్షన్ లేకపోతే..ప్లేస్టోర్ వెబ్‌సైట్‌ నుంచి ఈ గేమ్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. అలానే గేమర్స్‌ ఇకమీదట థర్డ్‌పార్టీల నుంచి బ్యాటిల్‌గ్రౌండ్స్‌ ఏపీకేను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరంలేదని వెల్లడించింది.

బీజీఎంఐ డౌన్‌లోడ్‌ లేదా అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఇన్‌-గేమ్‌ ఈవెంట్ సెక్షన్‌ నుంచి కానిస్టేబుల్ ఔట్‌ఫిట్‌ సెట్‌ను పొందొచ్చు. గేమ్ 10 మిలియన్‌ డౌన్‌లోడ్‌లు పూర్తయిన సందర్భంగా క్రాఫ్టన్‌ సంస్థ ఈ ఔట్‌ఫిట్‌ను రివార్డుగా ప్రకటించింది. దాంతోపాటు 1 మిలియన్‌, 5 మిలియన్ డౌన్‌లోడ్‌లు పూర్తయినప్పుడు ప్రకటించిన ఇండియా కా బ్యాటిల్‌గ్రౌండ్స్‌ గిఫ్ట్‌ రివార్డ్‌ పొందేందుకు గడువు తేదీని ఆగస్టు 19 వరకూ పొడిగించింది. తాజా బీజీఎంఐలో కొన్ని రకాల  మార్పులు చేసినట్లు క్రాఫ్టన్‌ కంపెనీ తెలిపింది. ఇక మీదట గేమ్‌లోని క్యారెక్టర్‌లు పూర్తిస్థాయి కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తాయని వెల్లడించింది. అలానే యూజర్ల డేటాకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని క్రాఫ్టన్‌ సంస్థ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని