Weekend Tech: ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌.. యాపిల్‌ రికార్డులు.. గతవారం టెక్‌ కబుర్లు

యాపిల్ రికార్డు అమ్మకాల నుంచి OnePlus 10R స్పెసిఫికేషన్‌లు, వాట్సాప్‌ చాట్‌ బదిలీ... వంటి గతవారం ఆసక్తికర టెక్‌ కబుర్లు ప్రత్యేకంగా మీ కోసం..

Updated : 23 Jan 2022 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్ రికార్డు అమ్మకాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌, OnePlus 10R స్పెసిఫికేషన్‌లు, వాట్సాప్‌ చాట్‌ బదిలీ... వంటి గతవారం ఆసక్తికర టెక్‌ కబుర్లు ప్రత్యేకంగా మీ కోసం..

వన్‌ప్లస్‌ 10ఆర్‌ ప్రత్యేకతలివే!

OnePlus 9RT భారత్‌లో లాంచ్‌ అయిన తర్వాత మరికొద్ది రోజుల్లో రాబోయే OnePlus 10Rపై గ్యాడ్జెట్‌ ప్రియులకు మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోయే మోడల్‌ OnePlus 10R స్పెసిఫికేషన్‌లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000, అమోలెడ్‌ 120 హెర్జ్‌ డిస్‌ప్లే, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్‌తో ఈ మొబైల్‌ రాబోతోందని అంచనా. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఇది భారతలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

వాట్సాప్‌ చాట్‌ బదిలీ

ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్‌ చాట్‌ బదిలీ ఇక త్వరలో సాధ్యం కానుంది. ఈ మేరకు వాట్సాప్‌ చర్యలు చేపట్టింది. కేబుల్‌ లేదా వైఫై కనెక్షన్‌ను ఉపయోగించి చాట్‌ బదిలీ చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి శాంసంగ్‌ వినియోగదారులు స్మార్ట్‌స్విచ్‌ (SmartSwitch) యాప్‌ను ఉపయోగించి వాట్సాప్‌ చాట్‌ను ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌కు బదిలీ చేసుకునే వీలుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌

నెలనెలా ఆదాయాన్ని సంపాదించడానికి కంటెంట్‌ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకొచ్చింది. ఇకపై క్రియేటర్‌ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయాలంటే యూజర్లు డబ్బులు చెల్లించాలి. క్రియేటర్లు తమ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధరను వారే స్వయంగా నిర్ణయించుకోవచ్చని ఇన్‌స్టా యాజమాన్యం మెటా వెల్లడించింది. ఈ మేరకు యూజర్లు ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లో ‘సబ్‌స్క్రైబ్‌’ బటన్‌ అన్‌లాక్‌, ఆన్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ప్రస్తుతం అమెరికాలోని పలువురు కంటెంట్‌ క్రియేటర్లు, అథ్లెట్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలకు ఇన్‌స్టా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో మరింత మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. 

వచ్చే నెల నుంచే..

మైక్రోసాఫ్ట్ తన టాప్‌-ఎండ్ పీసీ ‘సర్ఫేస్ ప్రో 8 (Surface Pro 8)’, ‘సర్ఫేస్ ప్రో 7+ (Surface Pro 7+)’లను భారత్‌లో విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ లాప్‌టాప్‌ అమ్మకాలు ప్రారంభకానున్నాయి. ధర సర్ఫేస్ ప్రో 7+  ప్రారంభ ధర ₹83,999 ఉండగా, సర్ఫేస్ ప్రో 8లో 8జీబీ ర్యామ్‌ వెర్షన్ ₹1,15,999 ఉండనుంది. 

అతి త్వరలో ఒప్పో రెనో 7

‘ఒప్పో రెనో 7 (Oppo Reno 7)’ సిరీస్ 5 జీ మొబైల్స్‌ను అతి త్వరలో భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పో రెనో 7, రెనో 7 ప్రో, రెనో 7 ఎస్‌ఈను కంపెనీ ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదల చేసింది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 జీబీ/256 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో ఇవి లభిస్తాయి. వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 778జీ, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్లను ఉపయోగించారు. 90 హెర్జ్‌, 180 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్లతో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మరోవైపు సోనీ IMX709 అల్ట్రా-సెన్సింగ్ సెన్సార్, ఫ్లాగ్‌షిప్ సోనీ IMX766 సెన్సార్‌తో వస్తుంది.

యాపిల్‌ రికార్డు అమ్మకాలు

గత ఏడాదికి సంబంధించి అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. 2021లో 6 మిలియన్ల ఐఫోన్ యూనిట్లను యాపిల్‌ విక్రయించగా, 2020లో అమ్మకాలు 3 మిలియన్ యూనిట్ల ఉండటం గమనార్హం. 

* Samsung Galaxy S22 అల్ట్రా మోడల్‌ ఈ ఫిబ్రవరిలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. Exynos 2200 SoC, క్వాడ్‌-కెమెరా సెటప్‌ వంటి అధునాతన ఫీచర్లతో ఈ మొబైల్‌ వస్తున్న సంగతి తెలిసిందే.

* ఇక యూట్యూబ్ తన ప్రీమియం సేవల కోసం కొత్త వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు దేశంలో నెలవారీ లేదా త్రైమాసిక ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని