ఫొటోలపై వాటర్‌మార్క్‌.. వేసుకోండిలా..! 

వెబ్‌ పోర్టళ్లు, న్యూస్‌ యాప్‌లు ఎక్కువైన తర్వాత ఫొటోల వినియోగం పెరిగిపోయింది. అరుదైన, ప్రత్యేకమైన చిత్రాలను కొన్ని సంస్థలు విక్రయిస్తూ ఉంటాయి. వాటిని అనుమతి లేకుండా వాడితే జరిమానాలు...

Updated : 20 Jan 2021 15:48 IST

వెబ్‌ పోర్టళ్లు, న్యూస్‌ యాప్‌లు ఎక్కువైన తర్వాత ఫొటోల వినియోగం పెరిగిపోయింది. అరుదైన, ప్రత్యేకమైన చిత్రాలను కొన్ని సంస్థలు విక్రయిస్తూ ఉంటాయి. వాటిని అనుమతి లేకుండా వాడితే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. పొరపాటున వాడితే వారెలా తెలుసుకుంటారనేదిగా అనుమానం..? ఫొటోలకు వాటర్‌ మార్క్‌ జత చేయడంతో తేలికగా తెలుసుకునే వీలుంది. అయితే ఫొటోలకు వాటర్ మార్క్ ఎలా వేయాలో ఓ సారి లుక్కేద్దాం..

అసలు వాటర్‌ మార్క్‌ అంటే ఏమిటి..?

వాటర్‌మార్క్ అనేది ఫొటోలపై పారదర్శక మార్కర్‌గా కనిపిస్తుంది. ఓ ఫొటో మీద వాటర్‌ మార్క్‌ ఉంచడం వల్ల ప్రైవసీని అరికట్టవచ్చు. మన బ్రాండ్‌ ఫొటోలను సులభంగా గుర్తుపట్టే వీలు కలుగుతుంది. ఉదాహరణకు ఒక ఫొటో తీశారు. దాని మీద మీ పేరును వాటర్‌ మార్క్‌గా పెట్టుకుంటే.. ఆ చిత్రం మీకు సంబంధించినదిగా ఇతరులు ఇట్టే చెప్పేస్తారు. వాటర్‌ మార్క్‌ను విండోస్‌, మాక్‌ ఓఎస్‌, ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఆన్‌లైన్‌ విభాగాల్లో ఎలా జోడించవచ్చో తెలుసుకుందాం..

విండోస్‌లో వాటర్‌మార్క్‌

ఫొటోల మీద వాటర్‌ మార్క్‌లను జత చేసేందుకు చాలా యాప్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. విండోస్‌లో ఫొటో మీద వాటర్ మార్క్‌ పెట్టేందుకు ‘WaterMark’ యాప్ ఒకటి. దీనితో  ఫొటోల మీద టెక్ట్స్‌, ఇమేజ్‌ వాటర్ మార్క్‌ను పెట్టేయవచ్చు. ‘WaterMark’ యాప్‌తో విండోస్‌లో వాటర్‌ మార్క్‌ను జత చేయడం ఎలాగో తెలుసుకోండి..
* విండోస్‌ పీసీలో WaterMark యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.
* ఇంపోర్ట్‌ ఇమేజ్‌ను క్లిక్‌ చేయండి
* కుడి వైపున ఉండే డ్రాప్‌డౌన్ మెను కింద Configuration బాక్స్‌లో ఎలాంటి (టెక్ట్స్‌, ఇమేజ్‌) వాటర్‌ మార్క్‌ను యాడ్‌ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్‌ చేసుకోవాలి. 
* ఒక వేళ టెక్ట్స్‌ సెలెక్ట్‌ చేసుకుంటే, ఫార్మాట్‌ ప్రకారం ఏమి రాయాలనేది ఎంచుకోవచ్చు. 
* ఒక వేళ ఇమేజ్‌ ఎంచుకుంటే.. ఫొటోలకు వాటర్‌ మార్క్‌గా కస్టమ్‌ ఇమేజ్‌ను యాడ్‌ చేయవచ్చు. దాని కోసం Choose WaterMark బటన్‌ను సెలెక్ట్‌ చేసకుని వాటర్‌ మార్క్‌ ఇమేజ్‌ను జత చేసుకోవచ్చు.

 

మ్యాక్‌ ‌ ఓఎస్‌లో.. 

మ్యాక్‌‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఫొటో మీద టెక్ట్స్‌, ఇమేజ్‌ను వాటర్‌మార్క్‌గా ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం.. టెక్ట్స్‌ను వాటర్‌మార్క్‌గా పెట్టుకోవాలంటే ఇలా చేయండి..
* ప్రివ్యూతో ఫొటోను ఓపెన్ చేయాలి
* వ్యూ>షో మార్కప్‌ టూల్‌బార్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి
* T ఐకాన్‌ క్లిక్‌ చేసి టెక్ట్స్‌ను ఫొటో మీద యాడ్‌ చేయండి
* టెక్ట్స్‌ టైప్‌ చేసిన A ఐకాన్‌ మెను ఉపయోగించి టెక్ట్స్‌ వాటర్‌మార్క్‌ ఫార్మాట్‌ను మార్చుకోండి
* వాటర్‌మార్క్‌ను ఫొటో మీద ఎక్కడ ఉంచుకోవాలో మూవ్‌ చేయండి
* Click>Saveను క్లిక్‌ చేసి వాటర్‌మార్క్‌ చేసిన ఫొటోను సేవ్‌ చేసుకోండి

ఫొటోకు ఇమేజ్‌ను వాటర్‌మార్క్‌గా పెట్టుకోవడం ఇలా..

* మ్యాక్‌ ‌ఓఎస్‌లో ఉచితంగా లభ్యమయ్యే Resize Master యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి
* Resize డ్రాప్‌డౌన్‌ మెను నుంచి Do not resizeను ఎంచుకోవాలి
* కాపీ మెటాడేటా ఆప్షన్‌ మీద టిక్‌ చేయాలి
* WaterMark డ్రాప్‌డౌన్‌ మెను నుంచి వాటర్‌మార్క్‌ పొజిషన్‌ను ఎంచుకోవాలి
* వాటర్‌మార్క్‌ డ్రాప్‌డౌన్‌ తర్వాత ఉండే త్రి డాట్స్‌ను క్లిక్‌ చేయండి. ఎలాంటి వాటర్‌మార్క్‌ను జత చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్‌ను ఎంచుకోండి
* Format మెను నుంచి అవుట్‌పుట్‌ ఫార్మాట్‌ను సెలెక్ట్‌ చేసుకోండి
* వాటర్‌మార్క్‌డ్‌ ఫొటోను ఎక్కడ చేసుకోవాలో స్టార్ట్‌ ప్రాసెసింగ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది

 

ఐఓఎస్‌లో వాటర్‌మార్క్‌ను పెట్టడం..

ఐఓఎస్‌లో వాటర్‌మార్క్‌ను జత చేసుకునేందుకు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఉచితంగా లభిస్తుండగా.. మరికొన్నింటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
* eZy Watermark Photos Lite యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఈ యాప్‌ ఉచితంగా, ఇన్‌యాప్‌ పర్చేజ్‌లోనూ దొరుకుతుంది. 
* యాప్‌ను ఓపెన్‌ చేసి సింగిల్‌ ఇమేజ్‌ క్లిక్‌ చేయండి
* వాటర్‌మార్క్‌ వేయాలనుకునే ఫొటోను సెలెక్ట్‌ చేసుకోవాలి. 
* వాటర్‌మార్క్‌ను ఎక్కడ వేయాలో ఎంచుకోవాలి. మల్టిపుల్‌ వాటర్‌మార్క్‌ సోర్స్‌లను సెలెక్ట్‌ చేసుకునే అవకాశం ఉంది
* ఫొటో మీద వాటర్‌మార్క్‌ను అడ్జస్ట్‌ చేసుకొని సేవ్‌ చేసుకోవాలి

 

ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో..

ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లోనూ ఫొటోలకు వాటర్‌మార్క్‌ యాడ్‌ చేసుకునేందుకు చాలా యాప్‌లు ఉన్నాయి. ఉచితంగా అందుబాటులో ఉండే ఓ యాప్‌ గురించి.. 
* Add WaterMark on Photos యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. 
* యాప్‌ ఓపెన్‌ చేసి Apply on Images ఎంచుకోండి
* వాటర్‌మార్క్‌ను యాడ్‌ చేయాలనుకునే ఫొటోను సెలెక్ట్‌ చేసి Done క్లిక్‌ చేయండి
* ఫొటో మీద టెక్ట్స్‌ను రాయాలంటే క్రియేట్‌ వాటర్‌మార్క్‌ అని ట్యాప్ చేయాలి
* వాటర్‌మార్క్‌గా ఇమేజ్‌ను వాడాలంటే సెలెక్ట్‌ ఫ్రం గ్యాలరీని క్లిక్‌ చేసి ఎంచుకోవాలి
* టెక్ట్స్‌ వాటర్‌మార్క్‌, ఇమేజ్ వాటర్‌మార్క్‌ను ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడికి డ్రాగ్ చేయాలి. 
* వాటర్‌మార్క్‌ చేసిన తర్వాత చెక్‌మార్క్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేసి సేవ్‌ చేసుకోవడమే.

 

ఆన్‌లైన్‌లో.. 

యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. ఒకటి లేదా కొన్ని ఫొటోలకు మాత్రమే వాటర్‌మార్క్‌ వేయాలనుకుంటే మాత్రం యాప్‌ల డౌన్‌లోడ్‌ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో పూర్తి చేసేసుకోవచ్చు. అలా వెబ్‌సైట్‌ ద్వారా వాటర్‌మార్క్‌ను జతపరచడం ఎలాగో తెలుసుకుందాం...
* బ్రౌజర్‌లో WaterMark.ws వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి
* Get Startedను క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌ టూల్‌తో వాటర్‌మార్క్‌ను జతపరచవచ్చు
* సైట్‌లోకి ఫొటోను తీసుకుని Edit క్లిక్‌ చేయాలి
* ఎడిటింగ్‌ స్క్రీన్‌ మీద వాటర్‌మార్క్‌ క్లిక్‌ చేసి టెక్ట్స్‌ను లేదా లోగోను ఎంచుకోవాలి
* వాటర్‌మార్క్‌ను ఫొటోకు యాడ్ చేసి ఫినిష్‌ క్లిక్‌ చేయాలి
* ఫినిష్‌ అయిన ఫైల్‌ను సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి..
* బైడెన్‌ ప్రమాణస్వీకారం.. ఆసక్తికర విషయాలు
*  సీఈఎస్‌ 2021లో అదరగొట్టిన బెస్ట్ ఉత్పత్తులివే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని