‘అలెక్సా’తో వస్తున్న లెనోవా ల్యాపీలు
లెనోవా కంపెనీ మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లెనోవా యోగా 9ఐ, యోగా 7ఐ, ఐడియాపాడ్ స్లిమ్ 5ఐ పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. 11వ జనరేషన్ టైగర్ లేక్ ప్రాసెసర్, వెబ్‌కామ్ ప్రైవసీ షట్టర్‌తో పాటు...
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చైనా కంపెనీ లెనోవో మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లెనోవో యోగా 9ఐ, యోగా 7ఐ, ఐడియా పాడ్ స్లిమ్ 5ఐ పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. 11వ జనరేషన్ టైగర్ లేక్ ప్రాసెసర్, వెబ్‌కామ్ ప్రైవసీ షట్టర్‌తో (వీడియో కాల్ మాట్లాడేప్పుడు మాత్రమే కెమెరా పనిచేస్తుంది) పాటు యోగా 9ఐ, 5ఐ మోడల్స్ డిస్ప్లేని 360 డిగ్రీల కోణంలో డిస్ప్లేని తిప్పుకోవచ్చు. అంతేకాకుండా 9ఐలో 4K డిస్ప్లే, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ఇంకా వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో ఓసారి చూద్దామా?
లెనోవా యోగా 9ఐ
యోగా సిరీస్‌లో వస్తున్న ప్రీమియం ల్యాప్‌టాప్. విండోస్ 10 హోమ్ లేదా విండోస్ 10 ప్రో ఓఎస్‌తో పనిచేస్తుంది. 14 అంగుళాల అల్ట్రా హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇందులో పదకొండో జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-1165జీ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌ను ఇస్తున్నారు. నాలుగు స్పీకర్లు ఉన్నాయి. అందులో రెండు వూఫర్లు, రెండు ట్వీటర్స్. లిథియమ్ ఐయాన్ పాలిమర్ బ్యాటరీ ఉంది. ప్రైవసీ షట్టర్‌తో 1ఎంపీ వెబ్ కెమెరా ఇస్తున్నారు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ రీడర్, స్మార్ట్ సెన్సర్ టచ్‌పాడ్ కూడా ఉన్నాయి. 16జీబీ ర్యామ్ సపోర్ట్, 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ సామర్థ్యం ఇస్తున్నారు. దీని ధర రూ.1,69,990. బ్లాక్ కలర్లో లభిస్తుంది.
లెనోవా యోగా 7ఐ
డిస్ప్లే మినహా 7ఐలో కూడా దాదాపు 9ఐ ఫీచర్లనే ఇస్తున్నారు. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నారు. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఉపయోగించారు. విండోస్ హోమ్ లేదా విండోస్ 10 ప్రో ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఇస్తున్నారు. డాల్బీ అట్మోస్‌తో స్పీకర్ సిస్టం, ప్రైవసీ షట్టర్‌తో 1ఎంపీ వెబ్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్ సపోర్ట్‌తో పాటు ఎస్ఎస్డీ స్టోరేజ్ సామర్థ్యం 1టీబీ ఉంది. దీని ధర రూ. 99,000. స్లేట్ గ్రే కలర్లో లభిస్తుంది.
లెనోవా ఐడియాపాడ్ స్లిమ్ 5ఐ
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 10 హోమ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ఇస్తున్నారు. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 టైగర్ లేక్ ప్రాసెసర్ ఉపయోగించారు. నివిడియా జీఈఫోర్స్ ఎమ్ఎక్స్459 గ్రాఫిక్స్ ఇస్తున్నారు. ప్రైవసీ షట్టర్‌తో 720పీ హెచ్డీ కెమెరా ఇస్తున్నారు. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో మూడు గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్/ 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ సామర్థ్యం ఉన్నాయి. ఈ మోడల్ ధర రూ. 63,990. గ్రాఫైట్ గ్రే కలర్లో లభిస్తుంది. లెనోవా, అమెజాన్, లెనోవా ఆఫ్‌లైన్ స్టోర్లలో వీటిని కొనుగోలు చెయ్యొచ్చు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.