Published : 03 Jan 2022 16:19 IST

Mobile Apps: కొత్త ఏడాదిని ‘స్మార్ట్‌’గా గడిపేద్దాం.. రండి!

కొత్త ఏడాది వచ్చేసింది..! గత అనుభవాల్లో తప్పుఒప్పులు బేరీజు వేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశం.. అసలే జీవితం చాలా చిన్నది.. ఈ చిట్టి లైఫ్‌లో ఉన్న ఆ కాసింత సమయాన్ని ఎక్కువగా ఫోన్స్‌తో గడిపేస్తే ఎలా..?

టెక్‌ యుగంలో దాదాపు 50 శాతం మంది ప్రజలు.. రోజులో 5-6 గంటలు స్మార్ట్‌ఫోన్ల వినియోగానికే గడుపుతున్నారట. అవసరం ఉన్నా.. లేకున్నా.. తెలియకుండానే ఫోన్లలో గంటల తరబడి సమయం వృథా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన ఏడాదిలోనైనా ఫోన్‌లను అవసరమైనంత మేరకు వాడి.. ‘స్మార్ట్‌’గా జీవించాలని చాలా మంది భావిస్తున్నారు. ఇందుకు మొబైల్స్‌లోని పలు యాప్‌లకు పూర్తిగా స్వస్తి పలకడం, లేదా వాటి వినియోగాన్ని తగ్గించడం చేస్తున్నారు. మరి 2022లో ప్రపంచం వదిలేయాలని చూస్తున్న వాటిల్లో ఏమున్నాయో మీరు ఓ లుక్కెయండి..

ముందు వరుసలో సామాజిక మాధ్యమాలు

కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నామో తెలియకుండానే సోషల్‌ మీడియాలో గంటల తరబడి సమయం గడిపేస్తాం. ముఖ్యమైన విషయాలను సైతం పక్కనపెట్టి అందులో మూతి పెట్టేస్తాం. ఇది మన వ్యక్తిగత, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇందువల్లే ప్రపంచంలోని చాలా మంది సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. లేదంటే తాత్కాలిక విరామం తీసుకోవాలని యోచిస్తున్నారు. సోషల్‌ మీడియా ఫుష్‌ నోటిఫికేషన్లను ఆఫ్‌ చేసి, వాటిపై దృష్టి మళ్లకుండా ఉండాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రత్యేకంగా ఓ సమయం కేటాయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మన వ్యక్తిగత జీవితాన్ని సాఫీగా గడపవచ్చని సూచిస్తున్నారు. 

ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు.. 

సామాజిక మాధమ్యాల తర్వాత మన సమయాన్ని డిస్ట్రాక్ట్‌ చేసే వాటిల్లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ కూడా ఒకటి. కరోనా కారణంగా ఇది ఈ మధ్య ఎక్కువైంది. కొన్నిసార్లు పని ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఉపయోగపడుతాయి. అయితే, వీటికి ప్రత్యామ్నాయంగా 2022లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు ఫోన్‌ ఓవర్‌ హీట్‌, స్టోరేజ్‌ సమస్య వంటి కారణాలతో పలువురు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. ఆరోగ్యం దృష్ట్యా శారీరక దృఢత్వం పెంచుకోవాలని మైదానంలో అడుగేయాలని చూస్తున్నారు. 

‘డేటింగ్‌’కు వీడ్కోలు..!

కరోనా కాలంలో డేటింగ్‌ యాప్‌లకు ఆదరణ ఎక్కువైంది. డేటింగ్‌ యాప్‌లపై ఆధారపడటం అంతగా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. డేటింగ్‌ యాప్‌లకు పెరుగుతున్న సబ్‌స్క్రిప్షన్‌ ధరలు, భద్రతా సమస్యల వంటి కారణాల వల్ల వీటికి చాలామంది వీడ్కోలు పలుకుతున్నారు. 

* వంట చేయలేని సమయం అంతగా లేనప్పుడు ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై ఆధారపడటం మంచిదే. కానీ, వీటిపై అతి ఆధారపడటం ఇష్టంలేక పలువురు వీటికి 2022లో బైబై చెప్పనున్నారు. ఆరోగ్యకరమైన వంటలు వండుకొని తినాలని భావిస్తున్నారు. అలాగే పలు సంస్థల్లో పనిచేసే వారు స్కానింగ్‌ యాప్‌లు ఎక్కుగా వినియోగిస్తుంటారు. అయితే, వ్యక్తిగత డేటా సేకరించడం, భద్రతా పరమైన సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా వీటికి కొందరు మొబైల్‌ నుంచి తొలగిస్తున్నారు. మొబైల్‌ కెమెరాలో చాలా ఫీచర్లు అందులో ఉన్నందున ప్రత్యేకంగా స్కానింగ్‌ యాప్‌లు ఎందుకని ఆలోచిస్తున్నారు. 

తొలగించలా వద్దా..?

యాప్‌లను తొలగించడం అనేది కేవలం న్యూ ఇయర్‌ ట్రెండ్‌ మాత్రమే కాదు. మీ లైఫ్‌స్టైల్‌ మార్చుకోవడానికి ఎప్పుటికప్పుడు అనవసరమైన యాప్‌లకు కత్తేర వేయాల్సిందే. అది కూడా మీ సమయాన్ని పాడు చేస్తుందని కచ్చితంగా తెలుసుకున్న తరువాతే. యాప్‌ల తొలగింపులో సూక్ష్మ దృష్టితో ఆలోచించాలి. యాప్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించకుండా.. వాటిని మెరుగ్గా ఉపయోగించుకునే మార్గాలు అన్వేషించాలి. పుష్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం, వ్యక్తులను అన్‌ఫాలో, అన్‌ఫ్రెండ్ చేయడం, రోజుకు కేవలం గంట లేదా రెండు గంటలు మాత్రమే యాప్‌ను ఉపయోగించడం మంచిది. అయినప్పటికీ సమయం ఎవ్వరి కోసం ఆగదన్న సంగతిని మరవొద్దు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని