బడ్జెట్ ధరలో ఎల్జీ కొత్త ఫోన్లు..
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎల్జీ మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్జీ డబ్ల్యూ11, డబ్ల్యూ31, డబ్ల్యూ31+ పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ బటన్...
ఇంటర్నెట్ డెస్క్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎల్జీ మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్జీ డబ్ల్యూ11, డబ్ల్యూ31, డబ్ల్యూ31+ పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ బటన్, ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్స్‌తో బడ్జెట్ ధరలో అందిస్తున్నారు. గతంలో విడుదల చేసిన ఎల్జీ డబ్ల్యూ10, డబ్ల్యూ30, డబ్ల్యూ30 ప్రో మోడల్స్‌కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్లను తీసుకొస్తున్నారు.
ఎల్జీ డబ్ల్యూ 11
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.52-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. వెనక రెండు, ముందు భాగంలో ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13 ఎంపీ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో పాటు 2 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఎల్జీ డబ్ల్యూ31 & డబ్ల్యూ31+
ఈ మోడల్స్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.52-అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ విజన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తాయి. వీటిలో నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు.. ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్ కెమెరా, 5 ఎంపీ సూపర్ వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఎల్జీ డబ్ల్యూ31 మోడల్ 4జీబీ ర్యామ్/64జీబీ అంగర్గత మెమరీ వేరియంట్‌లో, డబ్ల్యూ31+ మోడల్ 4జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఇక ధర విషయానికొస్తే ఎల్జీ డబ్ల్యూ11 మోడల్ ధర రూ. 9,490, డబ్ల్యూ31 ధర రూ. 10,990 కాగా డబ్ల్యూ31+ ధర రూ. 11,990గా కంపెనీ నిర్ణయించింది. మూడు మోడల్స్ మిడ్‌నైట్ బ్లూ రంగులో లభిస్తాయి. వచ్చే నెల నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు