ఎల్‌జీ విర్టో యాప్‌.. ఫోన్ స్క్రీన్‌ ల్యాపీలో 

ఎల్‌జీ కంపెనీ విర్టో పేరుతో యాప్‌ను భారత్‌లోకి తీసుకురానుంది. ఈ యాప్‌తో ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ని బ్లూటూత్ సాయంతో ఎల్‌జీ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కంప్యూటర్ ద్వారా యాక్సెస్‌ చెయ్యొచ్చు... 

Published : 01 Feb 2021 23:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎల్‌జీ కంపెనీ విర్టో పేరుతో కొత్త యాప్‌ను భారత్‌లోకి తీసుకురానుంది. ఈ యాప్‌తో ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ని బ్లూటూత్ సాయంతో ఎల్‌జీ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కంప్యూటర్ ద్వారా యాక్సెస్‌ చెయ్యొచ్చు. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను 2021 మే 4 నుంచి మైక్రోసాఫ్ట్‌ ఇండియా స్టోర్‌లో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ యాప్ కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌, యాప్‌లను సపోర్ట్ చేయదని ఎల్‌జీ తెలిపింది. అలానే యాప్‌ను ఉపయోగించే ల్యాప్‌టాప్ విండోస్‌ 10 ఓఎస్‌తో పనిచేస్తుండాలి. విర్టోతో కనెక్ట్ అయిన తర్వాత ల్యాప్‌టాప్‌ నుంచే మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. స్ర్కీన్‌ మిర్రరింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల యూజర్స్ సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలుగుతారని ఎల్‌జీ తెలిపింది. డెల్‌ మొబైల్ కనెక్ట్ యాప్‌ డెవలెప్‌ చేసిన స్క్రీనోవేట్ టెక్నాలజీస్‌ అనే కంపెనీ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

ఇవీ చదవండి..

ఆండ్రాయిడ్ 12 ఇలానే ఉంటుందా..! 

యాపిల్‌ కొత్త పాలసీ..అలాంటి యాప్‌లకు చెక్‌! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని