
Smartphones 2022 : కొత్త ఏడాదిలోరాబోయే కొత్త మొబైల్స్ ఇవే!
ఇంటర్నెట్‌డెస్క్: భవిష్యత్తులో రాబోయే ఉత్పత్తుల గురించి ముందే తెలుసుకునేందుకు యూజర్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టెక్ కంపెనీలు కూడా కొత్త మోడల్ డివైజ్‌లను మార్కెట్లోకి విడుదల చేసే ముందే వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ల ద్వారా లీక్ చేస్తుంటాయి. 2021లో విడుదలయ్యే మోడల్స్ గురించి ఫీచర్లను మొబైల్ కంపెనీలు ముందుగానే వెల్లడించినప్పటికీ కరోనా రెండో దశ కారణంగా ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో కొన్ని మోడల్స్ ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో టెక్ ప్రియులు 2022లో విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్స్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. మరి 2022లో రాబోయే స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై ఓ లుక్కేద్దాం.
ఐఫోన్ ఎస్‌ఈ3 (iPhone SE3)
ఈ ఏడాది ఐఫోన్ 13ను మార్కెట్లోకి తీసుకొచ్చిన యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ3 మోడల్‌ను 2022 ప్రథమార్ధంలో విడుదల చేయనుందట. ఇందులో 4.7 అంగుళాల హెచ్‌డీ రెటీనా డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. యాపిల్ 5ఎన్‌ఎమ్ ఏ15 బయోనిక్ చిప్ ఉపయోగించినట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. దీనికోసం క్వాల్‌కోమ్ ఎక్స్60 5జీ మోడెమ్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. ఐఓఎస్ 15తో ఈ ఫోన్ పనిచేస్తుందట. టచ్ ఐడీ, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఎస్‌ఈ3లో వెనుక 12ఎంపీ, ముందు 7ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. ఈ ఫోన్ ధర రూ. 30 వేల నుంచి రూ. 35 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
షావోమి 11ఐ సిరీస్ (Xiaomi 11i Series)
షావోమి 11ఐ సిరీస్‌లో రెండు మోడళ్లు తీసుకురానుంది. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉపయోగించినట్లు సమాచారం. అలానే 11ఐ మోడల్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 11ఐ ప్రో మోడల్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పనిచేస్తాయి. భారత మార్కెట్లోకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ రానున్న తొలి ఫోన్ ఇదే. కేవలం 15 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని షావోమి చెబుతోంది. జనవరి మొదటి వారంలో ఈ ఫోన్ విడుదలకానుంది.
ఐఫోన్ 14 మ్యాక్స్ (iPhone 14 Max)
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లు కూడా 2022 ద్వితీయార్ధంలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే ఈ సారి ఐఫోన్ 14 సిరీస్‌లో మినీ మోడల్ ఉండదని సమాచారం. కేవలం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్స్‌ను మాత్రమే విడుదల చేయనుందట. ఈ ఫోన్లలో 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఐఫోన్ 14, 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 14 మాక్స్, ప్రో మాక్స్ మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందట. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయట. 48 ఎంపీ వైడ్‌లెన్స్‌తోపాటు, 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, టెలి లెన్స్ అమర్చినట్లు తెలుస్తోంది. ఇవి 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయట. అలానే 48 ఎంపీ కెమెరాలో పిక్సెల్ బిన్నింగ్ కెమెరా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇది తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా అత్యుత్తమ క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 8 జీబీ ర్యామ్, ఐఫోన్ 14 మోడల్స్‌లో 6జీబీ ర్యామ్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది. ఐఫోన్ 13 తరహాలోనే వీటిలో కూడా శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందట. ఈ ఫోన్లలో యాపిల్ 5ఎన్‌ఎమ్ ఏ16 బయోనిక్ చిప్ ఉపయోగిస్తున్నారని సమాచారం.
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ (Samsung Galaxy S22 Series)
శాంసంగ్ కంపెనీ కూడా గెలాక్సీ ఎస్ సిరీస్‌లో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పేరుతో ఈ మోడల్‌ను తీసుకొస్తుంది. గతేడాది వచ్చిన గెలాక్సీ ఎస్21 మోడల్‌కు కొనసాగింపుగా గెలాక్సీ ఎస్22, ఎస్22 ప్లస్, ఎస్22 అల్ట్రా మోడల్స్ రానున్నాయి. గ్లాస్ బ్యాక్ బాడీ, ఎస్-పెన్ ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఈ మోడల్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారట. ఈ మోడల్స్‌లో కొత్త కెమెరా సెటప్ ఇస్తున్నారట. ఇతర ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.
వన్‌ప్లస్ 10 సిరీస్ (OnePlus 10 Series)
వన్‌ప్లస్ 10 సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ను విడుదల చేయనుంది. వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రో పేరుతో వీటిని తీసుకురానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉపయోగించారు. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2k రిజల్యూషన్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఇస్తున్నారట. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 48ఎంపీ, 8 ఎంపీ కెమెరాలుంటాయని తెలుస్తోంది. ముందు సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అమర్చారినట్లు సమాచారం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, అది 80 వాట్, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ (Samsung Galaxy S21 FE)
గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ మోడల్‌ను కూడా శాంసంగ్ 2022లో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్‌ను రెండు రకాల ప్రాసెసర్లతో విడుదల చేయనున్నారు. స్నాప్‌డ్రాగన్ 888, ఎక్సినోస్ 2100 ప్రాసెసర్లను ఉపయోగించినట్లు సమాచారం. ఇవి రెండు 5జీ ప్రాసెసర్లు. జనవరిలో ఈ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఎస్21 సిరీస్‌లో లో-ఎండ్ మోడల్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారట. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని సమాచారం. 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. వెనుకవైపు 12 ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ వైడ్ యాంగిల్, 8 ఎంపీ టెలీ ఫొటో కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చినట్లు సమాచారం. 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదలకానుంది.
ఐక్యూ 9 సిరీస్ (iQOO 9 Series)
ఐక్యూ కంపెనీ 9 సిరీస్‌లో ఐక్యూ 9, ఐక్యూ 9 ప్రో లేదా లెజెండ్ పేరుతో రెండు మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 1 జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఐక్యూ 9 ప్రో మోడల్‌లో 6.78 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఐక్యూ 9 మోడల్‌లో 1080 పిక్సెల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. 12 జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందట. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. గతేదాడి ఐక్యూ 8 మోడల్‌ను భారత్‌లో విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ, వేర్వేరు కారణాలతో ఆ మోడల్‌ను భారత్‌లో విడుదల చేయలేదు. దాని స్థానంలో ఐక్యూ 9 సిరీస్‌ను విడుదల చేయనున్నారు.
రియల్‌మీ జీటీ 2 సిరీస్ (Realme GT 2 Series)
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 1 జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు కవర్‌ను ఎండిన ఆకులు, పేపర్ వేస్ట్ నుంచి తయారుచేసిన పదార్థంతో తయారు చేసినట్లు రియల్‌మీ చెబుతోంది. వైఫై ఫీచర్ మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రీమియం శ్రేణిలో రానున్న తొలి జీటీ సిరీస్ ఫోన్ ఇదేనని టెక్ వర్గాలు తెలిపాయి. వెనుకవైపు మూడు కెమెరాలలో రెండు 50 ఎంపీ కెమెరాలని సమాచారం.
మోటోరోలా మోటో జీ71 (Motorola Moto G71)
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నట్లు సమాచారం. ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారట. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం.
వివో వి23 సిరీస్ (Vivo V23 Series)
వివో కంపెనీ వి23 సిరీస్‌లో వి23, వివో వి23 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్లలో ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఇస్తున్నారు. వెనుకవైపు మూడు కెమెరాలు అమర్చారు. వాటిలో రెండు 108 ఎంపీ కెమెరాలు. అలానే ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక కలర్ ఛేజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్‌తో ఈ ఫోన్ రానుంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6A)
గతేడాది గూగుల్ పిక్సెల్ 6 మోడల్‌ను విడుదల చేసినప్పటికీ భారత్‌కు మాత్రం రాలేదు. దీంతో ఈ ఏడాది గూగుల్ పిక్సెల్ 6ఏ పేరుతో చిన్నపాటి మార్పులతో ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఫోన్ వెనుక భాగం గ్లాస్ కవర్‌తో ఉంటుందని తెలుస్తోంది. 6.2 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఇస్తున్నారట. టెన్సర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
వివో ఎక్స్80 సిరీస్ (Vivo X80 Series)
వివో కంపెనీ ఎక్స్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ను ఎక్స్ 80, ఎక్స్ 80 ప్రో, ఎక్స్ 80 ప్రో ప్లస్ పేరుతో మూడు వేరియంట్లలో తీసుకురానుంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందట. మీడియాటెక్ డైమెన్సిటీ 2000 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.