Home Security Camera: ఇంటి భద్రత కోసం సెక్యూరిటీ కెమెరాలు కావాలా..? వీటిపై ఓ లుక్కేయండి
ఇంటర్నెట్‌డెస్క్: ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఇల్లు.. ఇష్టపడి కొనుగోలు చేసి సామగ్రి. వీటిని వదిలి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్లాలంటే మనసులో ఎక్కడో భయం. వెళ్లిన చోట స్థిమితంగా ఉండలేం. ఇల్లు ఎలా ఉంది? ఇంట్లో వస్తువులు పాడయిపోతాయేమోననే ఆందోళన. మరోవైపు దొంగల భయం. అందుకే ఇంటి భద్రత విషయంలో మన వంతు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. దాంతో ఎక్కడి నుంచైనా మన ఇంటి ఆవరణలో ఏం జరుగుతుందనేది మానిటర్ చేయొచ్చు. కేవలం ఇంటి అవసరాల కోసమే కాదు.. షాపులు, పరిశ్రమలు ఇతరత్రా అవసరాల కోసం సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
సాధారణ సెక్యూరిటీ కెమెరాలకు వైర్ కనెక్షన్‌తోపాటు, డేటా స్టోరేజ్ కోసం పీసీ ఉండి తీరాలి. అంతేకాకుండా అది ఖర్చుతో కూడిన వ్యవహారం. అదే వైఫై సెక్యూరిటీ కెమెరాలయితే రికార్డ్ చేసిన మొత్తం డేటా క్లౌడ్‌లో స్టోర్ చేస్తుంది. అలానే దాన్ని మీ మొబైల్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు అందుబాటు ధరలో మంచి వైఫై సెక్యూరిటీ కెమెరా కోసం చూస్తున్నట్లయితే ఈ జాబితాపై ఓ లుక్కేయండి..
రియల్మీ స్మార్ట్ కామ్ 360 (Realme Smart Cam 360)
ఏఐ మోషన్ డిటెక్షన్, ఆడియో కమ్యూనికేషన్, తక్కువ కాంతిలో కూడా కలర్ విజన్, ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్, 3డీ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు రియల్మీ స్మార్ట్ కామ్ 360 సొంతం. 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 360 డిగ్రీ పనోరమిక్ వ్యూతో ఇది వీడియో రికార్డు చేస్తుంది. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్లను సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ మెమొరీ కార్డ్‌తో 14 రోజులపాటు నిరంతరాయంగా వీడియో రికార్డు చేయొచ్చు. దీని ధర ₹ 2,999.
జీబ్రానిక్స్ జెబ్ స్మార్ట్ కామ్ 101 (Zebronics Zeb Smart Cam 101)
జీబ్రానిక్స్ జెబ్ స్మార్ట్ కామ్‌తో కెమెరా అమర్చిన ప్రదేశంలోని వారితో సంభాషించవచ్చు. ఇందులో స్మార్ట్ ట్రాకింగ్, సౌండ్ డిటెక్షన్ సాంకేతికతతోపాటు వ్యక్తులను గుర్తించేందుకు ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. నైట్ విజన్ ఉంది. ఈ కెమెరాను ఒకేసారి వేర్వేరు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర ₹ 3,599.
షావోమి 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా (Xiaomi 360 Home Security Camera)
ఫుల్హెచ్డీ వీడియో క్వాలిటీ, 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 360-డిగ్రీ హారిజెంటల్, 108-డిగ్రీ వర్టికల్ వ్యూని షావోమి 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా అందిస్తుంది. నైట్ విజన్ కోసం ఇందులో 940 ఎన్ఎమ్ ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడీలు ఇస్తున్నారు. ఏఐ హ్యూమన్ డిటెక్షన్ సాంకేతికతతో కచ్చితత్వంతో కూడిన కదలికలను చూపిస్తుంది. షావోమి కెమెరా వ్యూయర్ యాప్ ద్వారా కెమెరాను కంట్రోల్ చేయడంతోపాటు, లైవ్ వీడియోల నుంచి స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఆడియో కమ్యూనికేషన్ ఫీచర్ కూడా ఉంది. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్లను సపోర్ట్ చేస్తుంది. దీని ధర ₹ 3,199.
టీపీ లింక్ టాపో సీ200 వీ3 (TP-Link Tapo C200 V3 )
ఈ కెమెరా కూడా 1080 పిక్సెల్ రిజల్యూషన్, 114 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో హెచ్డీ వీడియోలను రికార్డు చేస్తుంది. మోషన్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా మనుషుల కదలికలను యూజర్‌కు తెలియజేస్తుంది. నైట్ విజన్ ఫీచర్ ఉంది. ఆడియో కమ్యూనికేషన్ కోసం ఇందులో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉన్నాయి. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్లను సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ధర ₹ 2,499.
అమెజాన్ బ్లింక్ (Amazon Blink)
ఇంటి బయట, లోపలి సెక్యూరిటీ కోసం బ్లింక్ ఇండోర్, బ్లింక్ అవుట్డోర్ పేరుతో రెండు కెమెరాలను అమెజాన్ అందిస్తోంది. వీటిని ఎంతో సులభంగా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవచ్చు. అవుట్డోర్ కెమెరా ఇంటి బయట భద్రత కోసం కాగా, ఇండోర్ కెమెరా ఇంటి లోపలి భద్రత కోసం. అవుట్డోర్ కెమెరాలో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంది. వీటిని మనకు నచ్చిన ప్రదేశంలో ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్ నుంచి మానిటర్ చేయవచ్చు. అలాగే మనకు కావాల్సిన చోటకి వీటిని సులభంగా మార్చుకోవచ్చు. ఇండోర్ కెమెరాలో యాక్టివ్ జోన్, ప్రైవసీ జోన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాటి సాయంతో కెమెరా పరిధిలోని కొంత ప్రాంత్రాన్ని బ్లర్ చేయవచ్చు. అంతేకాకుండా బ్లింక్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న వారిని చూస్తూ వారితో మాట్లాడొచ్చు. అవుట్డోర్ కెమెరాలో కూడా ఈ సదుపాయం ఉంది. రెండు కెమెరాలకు అలెక్సా ఫీచర్ ఉంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో బ్లింక్ ఇండోర్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర ₹11,463.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Gift Ideas: రాఖీ పండగకి గిఫ్ట్ కొనాలా..? ₹5 వేల లోపు ధరలో ఉన్న వీటిపై ఓ లుక్కేయండి!
-
General News
Srisailam-Sagar: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
-
Movies News
AlluArjun: బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!
-
India News
India Corona: దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!
-
India News
ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
-
Movies News
Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?