Smart watches: ₹2Kలోపు ధరలో స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? వీటిపై ఓ లుక్కేయండి
ఇంటర్నెట్ డెస్క్: ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి ఫిట్నెస్ బ్యాండ్, స్మార్ట్ వాచ్ (Smart watch)లు ఉపయోగపడతాయి. ఆరోగ్య సమాచారంతోపాటు నోటిఫికేషన్ వ్యూ, కాలింగ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండటంతో స్మార్ట్‌వాచ్‌ల వాడకం ఇటీవల పెరిగింది. ఒకవేళ మీరు రూ.రెండు వేలలోపు ధరలో ఉన్న స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? ఈ జాబితాపై ఓ లుక్కేయండి!
అంబ్రేన్ వైజ్ ఇయాన్ (Ambrane Wise EON)
ఆంబ్రేన్ వైజ్ ఇయాన్ వాచ్‌లో 1.69 అంగుళాల స్మార్ట్ టచ్ డిస్ప్లే ఇస్తున్నారు. 24/7 హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌తోపాటు ఎస్పీఓ2 సెన్సర్లు, బ్లడ్ ప్రెజర్ ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, బ్రీత్ ట్రైయినింగ్, క్యాలరీ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 60 స్పోర్ట్స్ మోడ్స్ ఇస్తున్నారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఉంది. అంబ్రేన్ వైజ్ ఇయాన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజులపాటు నిరంతరాయం పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో మైక్రోఫోన్, స్పీకర్, క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర ₹1,999. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.
నాయిస్ కలర్‌ఫిట్ క్యూబ్ ఓ2 (Noise ColorFit Qube O2)
నాయిస్ఫిట్ ట్రాక్ యాప్ సాయంతో ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు యూజర్‌కు మొబైల్లో చూపిస్తుంది. స్పిన్నింగ్, వాకింగ్, రన్నింగ్, యోగా వంటి ఎనిమిది స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 1.4 అంగుళాల ఫుల్ టచ్ డిస్ప్లే ఇస్తున్నారు. హెల్త్ మానిటరింగ్ కోసం 24/7 హార్ట్ రేట్, ఎస్పీఓ2 మానిటర్ ఫీచర్లు ఉన్నాయి. కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, వాకింగ్ రిమైండర్, స్లీప్ మానిటర్, రిమోట్ మ్యూజిక్ కంట్రోల్, వేక్ గెస్చర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇస్తున్నారు. నాయిస్ కలర్‌ఫిట్ క్యూబ్ ఓ2 ధర ₹1,999. నాయిస్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు నుంచి ఏడు రోజులు పనిచేస్తుంది.
బౌల్ట్ కాస్మిక్ (Boult Cosmic)
కచ్చితమైన హార్ట్‌రేట్ మానిటరింగ్ కోసం ఈ వాచ్‌లో అడ్వాన్స్డ్ హెచ్ఆర్ సెన్సర్ ఉంది. ఇది యూజర్ ఫిట్నెస్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ క్యాలరీ బర్నింగ్, స్టెప్ కౌంట్ వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. 1.69 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే ఇస్తున్నారు. వందకుపైగా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. వీటితో యూజర్ తనకు నచ్చినట్లుగా డిస్ప్లే స్క్రీన్‌ను మార్చుకోవచ్చు. మహిళ కోసం మెన్స్ట్రువల్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది. బౌల్ట్ ట్రాక్ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్ రికార్డు చేసే ఆరోగ్య సమాచారాన్ని మొబైల్లో చూడొచ్చు. 20 రకాల గేమ్ మోడ్స్ ఉన్నాయి. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. పది నిమిషాల ఛార్జ్‌తో రెండు రోజులు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఐపీ 67 వాటర్ రెసిస్టెంట్ ఉంది. బౌల్ట్ కాస్మిక్ ధర ₹1,999. బౌల్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
ఫైర్‌బోల్ట్ నింజా 3 (Fire Boltt Ninja 3)
ఇందులో టచ్-టు-వేక్, లిఫ్ట్-టు-వేక్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఎక్కువసేపు కూర్చుని ఉంటే, లేచి కొన్ని అడుగులు వేయమని సూచిస్తాయి. రక్తంలోని ఆక్సిజన్ లెవల్స్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు ఎస్పీఓ2, 24/7 హార్ట్‌రేట్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఫిట్నెస్ కోసం వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఇస్తున్నారు. వీటితో యూజర్ తనకు నచ్చిన గేమ్‌ను ఎంచుకుని టాస్క్ పూర్తి చేయొచ్చు. నోటిఫికేషన్ అలర్ట్, స్లీప్ మానిటరింగ్, కెమెరా కంట్రోల్, ఐపీ67 వాటర్ రెసిస్టెంట్, వెదర్ అప్డేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫైర్‌బోల్ట్ నింజా 3 స్మార్ట్‌వాచ్‌లో 1.3 అంగుళాల ఫుల్ టచ్ హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నారు. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు రోజులు పనిచేయడంతో పాటు, స్టాండ్బైలో 15 రోజులు ఉంటుంది.
బోట్ వేవ్ లైట్ (Boat Wave Lite)
ఫుట్‌బాల్, యోగా, సైక్లింగ్, వాకింగ్, బ్యాడ్మింటన్, రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్కిప్పింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్ స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. 1.69 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నారు. ఇతర స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే ఇది లైట్ వెయిట్. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. బోట్ వేవ్ లైట్ ధర ₹ 1,799. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజులు పనిచేస్తుంది. వందకుపైగా వాచ్ ఫేస్‌లు, నోటిఫికేషన్ అలర్ట్, హార్ట్‌రేట్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ (Noise ColorFit Pulse Grand)
1.69 ఎల్సీడీ డిస్ప్లే ఇస్తున్నారు. 150కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు, 60 స్పోర్ట్ మోడ్లు ఉన్నాయి. హెల్త్ మానిటరింగ్ కోసం బ్లడ్ ఆక్సిజన్, 24/7 హార్ట్‌రేట్, స్ట్రెస్, స్లీప్ మానిటర్లతో పాటు మహిళ కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకర్ ఉన్నాయి. ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. వేక్ గెస్చర్, కాల్ రిజెక్షన్, కాల్ రిమైండర్, హ్యాండ్ వాష్ రిమైండర్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్ కంట్రోల్, ఐపీ 68 రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ ధర ₹ 1,799. నాయిస్, అమెజాన్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఫైర్‌బోల్ట్ టాక్ 2 (Fire Boltt Talk 2)
బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో అందుబాటు ధరలో ఉన్న స్మార్ట్‌వాచ్. ఫైర్‌బోల్ట్ టాక్ 2 గుండ్రటి డిజైన్‌తో మెటల్ బాడీ ఇస్తున్నారు. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 60 స్పోర్ట్స్ మోడ్స్, ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్, ఎస్పీఓ2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌కు అదనపు ఆకర్షణ ఇన్‌బిల్ట్ గేమ్స్. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర ₹1,999. ఫైర్‌బోల్ట్, అమెజాన్ వెబ్సైట్ల నుంచి ఆర్డర్ చేయొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
Politics News
Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
-
Politics News
jagadishreddy: మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
Viral-videos News
Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gorantla madhav: మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ