Published : 04 Oct 2021 10:15 IST

Eco Friendly Smart Phone: ఫోన్‌ ఇలా వాడితే ఎలా ఉంటుందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైన కొద్దీ ఈ-వేస్ట్‌ కూడా పెరిగిపోయింది. సరాసరి ప్రతి రెండేళ్లకొకసారి వినియోగదారులు తమ ఫోన్లను మారుస్తూ ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ-వ్యర్థాల భారం పెనుసమస్యగా మారుతోంది.  దీనిని నిలువరించాలంటే ఎకో-ఫ్రెండ్లీగా ఉండే స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగాలి. వినియోగదారునిగా మీ తర్వాతి స్మార్ట్‌ఫోన్‌నైనా పర్యావరణహితంగా ఉండేలా చేయండి.

ప్రత్యేక ఫోన్‌గా పరిగణించాలి

స్మార్ట్‌ఫోన్‌ రూపొందించాలంటే ఎన్నో విడిభాగాలను తయారు చేయాల్సి ఉంటుంది. వాటిలో పర్యావరణానికి హాని కలిగించేవీ ఉంటాయి. అంతే కాకుండా ఫోన్‌ తయారీ తర్వాత రిపేర్‌కు సంబంధించి మరికొన్ని ఉత్పత్తులను ప్రత్యేకంగా తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే డచ్‌కు చెందిన ఫెయిర్‌ఫోన్‌ సంస్థ పర్యావరణహిత స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తోంది. డిజైన్‌ నుంచి ఫోన్‌లోని పరికరాల వరకు అన్నీ పర్యావరణానికి అనుకూలంగానే ఉంటాయి. ఫోన్‌ను డిజేబుల్‌ చేయాలంటే మాత్రం ఫిలిప్స్‌ స్క్రూడ్రైవర్‌ ఉండాల్సిందే. దానిలోని ప్రతి భాగాలను భర్తీ చేయవచ్చు. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ ఎక్కువ కాలం రావడంతో ఈ-వ్యర్థాల సమస్య కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 

మెటీరియల్‌ కాస్ట్‌ తగ్గించాలి..

పర్యావరణహితంగా స్మార్ట్‌ఫోన్లను తయారు చేయాలంటే అందుకు తగిన మెటీరియల్స్‌ లేవు. మెటల్‌ చిప్‌సెట్‌లు, ప్లాస్టిక్‌ ఫోన్ కేసెస్‌ ( కవర్లు) వంటివన్నీ ఈ-వ్యర్థాల కిందకే వస్తాయి. ఇటీవల నోకియా, టెరాక్యూబ్‌ వంటి సంస్థలు బయోడిగ్రేడబుల్‌ ఫోన్‌ కవర్లను ప్రవేశపెట్టాయి. అంతేకాకుండా మెటీరియల్‌ కాస్ట్‌ కూడా తక్కువ కాబట్టి అమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టెరాక్యూబ్‌ మరికొంత ముందుకు దూసుకెళ్లింది. ప్రతి ఫోన్‌, లేదా యాక్సెరీస్‌ను అమ్మకంపై ఒక చెట్టును నాటాలని నిర్ణయించింది. స్మార్ట్‌ఫోన్ల తయారీ ఆధునీకరణ చెందకపోతే ఈ-వ్యర్థాల సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అలానే రీసైక్లింగ్‌ వ్యవస్థను పటిష్ఠపరచాలి. అయితే కొంతమంది రీసైక్లింగ్‌ చేసే సంస్థలు విలువైన మెటల్‌ని తీసుకుని మిగతావాటిని పడవేస్తున్నాయి. దీని వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి మీ పాత ఫోన్‌ను కేవలం లాభం కోసం విక్రయించడం కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలకు అందించే స్వచ్ఛంద సంస్థకు అందించడం ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. 

తరచూ ఫోన్లను మార్చడం మంచిది కాదు

ప్రతి నెలా ఏదొక అప్‌డేషన్‌తో కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే మీ ప్రాథమిక అవసరాలు తీరేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్‌ అక్కరకొస్తుంది. అలాంటప్పుడు అప్‌గ్రేడ్‌ పేరుతో మొబైల్స్‌ను తరచూ మారస్తుడటం వల్ల కూడా పర్యావరణానికి హాని కలిగించినవారమవుతాం. వాతావరణానికి కాకుండా ఇటు ఆర్థికంగానూ ఫోన్లను మారుస్తుండటం వల్ల నష్టమే. అందుకే దీర్ఘకాలికంగా ఫోన్లను వాడటం అనేది తెలివైన పనిగా నిపుణులు చెబుతుంటారు. శాంసంగ్‌, నోకియా వంటి సంస్థలు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను ఎక్కువగా చేస్తుంటాయి. కంపెనీలు తమ ఉత్పత్తులను విరివిగా మార్కెట్‌లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షించి లాభాలను ఆర్జిస్తుంటాయి. అయితే నోకియా, యాపిల్‌ వంటి సంస్థలు పర్యావరణ హితంగా తమ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

డిస్పోజబుల్‌ వస్తువుగానే ఫోన్‌..

స్మార్ట్‌ఫోన్లను సరదా కోసం కొనుగోలు చేసేవారే అధికం. అంతేకాకుండా ప్రతి రెండేళ్లకొకసారి మొబైల్‌ను మార్చాలని వినియోగదారులు భావిస్తుంటారు. అయితే ఇదంతా వ్యాపార కోణంలో ఉండదు. ఐప్యాడ్‌, ల్యాప్‌టాప్, కారు, ఫోన్లు వంటివాటిపై ఇన్వెస్ట్‌ చేసినా రిటర్న్‌ వస్తుందనే భరోసా ఉండదు. అయితే ఇప్పటికీ ఫోన్లను డిస్పోజబుల్‌ వస్తువుగానే పరిగణిస్తుంటారు చాలామంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని