Telegram rolled out new features: వెయ్యిమందితో టెలిగ్రాం గ్రూప్‌ కాలింగ్‌

మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌ సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం తీసుకొచ్చింది. వెయ్యిమంది పాల్గొనేలా గ్రూప్‌ వీడియో కాల్‌ అవకాశం కల్పించింది. స్నాప్‌ చాట్‌ మాదిరిగా...

Published : 04 Aug 2021 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రాం సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం తీసుకొచ్చింది. గ్రూప్‌ వీడియో కాల్‌లో ఒకేసారి వెయ్యిమంది పాల్గొనేలా అవకాశం కల్పించింది. స్నాప్‌ చాట్‌ మాదిరిగా అత్యుత్తమ క్వాలిటీతో వీడియో మెసేజ్‌ ఫీచర్‌ను కూడా యాడ్‌ చేసింది. అప్‌గ్రేటెడ్‌ ఫీచర్లను పొందాలంటే యాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే. గ్రూప్‌ వీడియో కాల్‌ను ప్రారంభించాలంటే.. మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్‌ ఇన్‌ఫో పేజీ నుంచి వాయిస్‌ చాట్‌ను క్రియేట్‌ చేసిన తర్వాత వీడియోను ఆప్షన్‌ను ఆన్‌ చేయాలి. 

గ్రూప్‌ కాలింగ్‌ ఇలా..

గ్రూప్‌ వీడియో కాల్‌ ఫీచర్‌కు సంబంధించి టెలిగ్రాం వివరాలను వెల్లడించింది. 30 మంది యూజర్ల వరకు తమ కెమెరా, స్క్రీన్‌ నుంచి వీడియోను బ్రాడ్‌కాస్ట్‌ చేయవచ్చని.. వెయ్యి మంది వీడియో స్ట్రీమింగ్‌ను చూడవచ్చని వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు, కమ్యూనికేషన్‌, ఈ-లెర్నింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో గ్రూప్‌ కాలింగ్‌లో పాల్గొనేవారి సంఖ్యను పెంచుతామని తెలిపింది. 

వీడియో మెసేజెస్..

అలానే స్నాప్‌చాట్‌ స్ఫూర్తితో వీడియో మెసేజెస్‌ ఫీచర్‌ను టెలిగ్రాం తీసుకొచ్చింది. మీ ఫోన్‌ గ్యాలరీకి వీడియోను యాడ్‌ చేయకుండానే చెకింగ్‌ లేదా షేర్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అత్యుత్తమ రిజల్యూషన్‌తో మినీ వీడియో మెసేజ్‌లను యూజర్‌ రికార్డ్ చేసి సెండ్‌ చేసుకోవచ్చని టెలిగ్రాం పేర్కొంది. వీడియో మెసేజ్‌ను రికార్డ్‌ చేయాలంటే.. మెసేజ్‌ బార్‌లోని మైక్రోఫోన్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేసి వాయిస్‌ మెసేజ్‌ రికార్డింగ్‌ నుంచి వీడియోకు మార్చాలి. రికార్డ్‌ ఆప్షన్‌ను ప్రెస్‌ అండ్‌ హోల్డ్‌ చేసి మళ్లీ కెమెరా ఐకాన్‌కు  వచ్చేయాలి. మీరు రికార్డ్‌ చేసిన ఆడియోను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూనే.. కెమెరాతో క్యాప్చర్‌ చేసిన వీడియో యాడ్‌ అవుతుంది. వీడియో ప్లేబ్యాక్‌ మ్యూజిక్‌ స్పీడ్‌ను 2X వరకు అడ్జెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు