Whatsapp: వాట్సాప్‌ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!

గ్రూపుల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకునే సదుపాయం వాట్సాప్‌ కల్పించింది. దీంతో పాటు మరో రెండు ప్రైవసీ ఫీచర్లను కూడా వాట్సాప్‌ పరిచయం చేసింది.

Updated : 14 Aug 2022 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలు కారణాలతో కొందరు వాట్సాప్‌ గ్రూపుల్లో ఇరుక్కుపోతుంటారు. బయటకి వస్తే గ్రూప్‌ సభ్యులు ఏమనుకుంటారో అనే సందేహం. ఒకవేళ వెళ్లిపోతే ‘ఎందుకెళ్లిపోయావ్‌?’ అన్ని ప్రశ్నలు. దీంతో కక్కలేక మింగలేక ఆ గ్రూప్‌లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపుల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకునే సదుపాయం కల్పించింది. దీంతో పాటు మరో రెండు ప్రైవసీ ఫీచర్లను కూడా వాట్సాప్‌ పరిచయం చేసింది. త్వరలోనే ఈ ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం రండి..

  • వాట్సాప్‌ గ్రూప్‌ల్లో ప్రస్తుతం ఎవరైనా సభ్యుడు లెఫ్ట్‌ అయితే.. వెంటనే అందరికీ తెలిసిపోతుంది. వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌ ద్వారా ఎవరైనా సభ్యుడు గ్రూప్‌ నుంచి ఎవరికీ తెలీకుండా వెళ్లిపోవచ్చు. కేవలం గ్రూప్‌ అడ్మిన్లకు మాత్రమే ఆ వివరాలు కనిపిస్తాయి.
  • మనం ఆన్‌లైన్‌లో ఎవరితోనో ఛాట్‌ చేస్తుంటాం. అదే టైమ్‌లో కొందరు మెసేజ్‌ చేస్తుంటారు. వారికి రిప్లయ్‌ ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు. అలాగని సైలెంట్‌గా ఉంటే.. ఆన్‌లైన్‌లో ఉన్నా రిప్లయ్‌ ఇవ్వలేదన్న అపవాదు ఉండిపోతుంది. అలాంటి వారికోసమే ఈ ఫీచర్‌. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరెవరు మిమ్మల్ని చూడొచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు.
  • వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను, వీడియోను ఒకసారే చూసే విధంగా వాట్సాప్‌ ఓ సదుపాయం తీసుకొచ్చింది. ఇలా పంపినప్పటికీ ఫొటోలను, వీడియోలను స్క్రీన్‌షాట్‌ తీసుకునే అవకాశం ఉంది. ఇకపై స్క్రీన్‌షాట్‌ను సైతం తీసుకునే వీల్లేకుండా వాట్సాప్‌ అడ్డుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని