META: ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ సెటింగ్స్‌ అన్నీ ఒకేచోట!

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ వంటి ఖాతాలను వాడుకుంటున్నారా? వీటిల్లో వేర్వేరుగా సెటింగ్స్‌ను మేనేజ్‌ చేయటం కష్టంగా ఉందా? ఇకపై అలాంటి ఇబ్బందేమీ లేదు.

Updated : 25 Jan 2023 11:41 IST

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ వంటి ఖాతాలను వాడుకుంటున్నారా? వీటిల్లో వేర్వేరుగా సెటింగ్స్‌ను మేనేజ్‌ చేయటం కష్టంగా ఉందా? ఇకపై అలాంటి ఇబ్బందేమీ లేదు. మెటా కొత్తగా అకౌంట్‌ సెంటర్‌ను ప్రవేశపెట్టనుంది. ఒకటి కన్నా ఎక్కువ మెటా ఖాతాలను వాడేవారికిది బాగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ, యాడ్‌ ప్రిఫరెన్సుల వంటివన్నీ ఈ సెంటర్‌లోనే ఉంటాయి. దీంతో వివిధ యాప్‌లు వాడేవారికి సెటింగ్స్‌ను మేనేజ్‌ చేసుకోవటం తేలికవుతుంది. ఉదాహరణకు- ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను అకౌంట్‌ సెంటర్‌కు జోడించుకున్నారనుకోండి. వాటికి సంబంధించిన యాడ్‌ టాపిక్‌ ప్రిఫరెన్సులను తేలికగా నిర్ణయించుకోవచ్చు. అకౌంట్‌ సెంటర్‌లో మార్చుకుంటే రెండింటికీ వర్తిస్తుంది. కావాలనుకుంటే తమ ఖాతాలను ఈ సెంటర్‌లో వేర్వేరుగానూ ఉంచుకోవచ్చు. ఇందుకోసం అదే అకౌంట్స్‌ సెంటర్‌కు ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని యాడ్‌ సెటింగ్స్‌ కంట్రోళ్లను మెరుగుపరచటం మీదా మెటా దృష్టి సారించింది. తమకు ఇష్టం లేని యాడ్స్‌ను తక్కువగా.. అదే సమయంలో ఇష్టమైన యాడ్స్‌ను ఎక్కువగా చూసేలా సెటింగ్స్‌ను మార్చుకోవటానికి వీలు కల్పించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని