ఎంఐ నుంచి క్యూఎల్‌ఈడీ టీవీ.. ధరెంతంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో కొత్త టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ క్యూఎల్‌ఈడీ 4K పేరిట దీన్ని  తీసుకొచ్చింది. ఇప్పటి వరకు....

Updated : 12 Aug 2022 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో కొత్త టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ క్యూఎల్‌ఈడీ 4K పేరిట దీన్ని  తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ఎల్‌ఈడీ టీవీల అమ్మకాలకే పరిమితమైన షావోమి తొలిసారి క్యూఎల్‌ఈడీ టీవీల మార్కెట్లోకి అడుగుపెట్టింది.

కేవలం 55 అంగుళాల సైజ్‌ ఆప్షన్‌లో మాత్రమే ఈ టీవీ లభిస్తుంది. దీని ధరను రూ.54,999గా కంపెనీ పేర్కొంది. డిసెంబర్‌ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోం స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 3,840× 2160 పిక్సెల్‌ కలిగిన క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. హెచ్‌ఎల్‌జీ, హెచ్‌డీఆర్‌ 10, హెచ్‌డీఆర్‌ 10+, డాల్బీ విజన్‌ వంటి హెచ్‌డీఆర్‌ ఫార్మాట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ టీవీ 10 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది.

మీడియా టెక్‌ ఎంటీ9611 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 30w సౌండ్‌ అవుట్‌పుట్‌, బిల్ట్‌ ఇన్‌ క్రోమ్‌క్యాస్ట్‌ సదుపాయాలు ఉన్నాయి. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులతో పాటు రెండు యూఎస్‌బీ పోర్టులను అందిస్తున్నారు. ఎంఐ ప్యాట్చ్‌వాల్‌ 3.5పై పనిచేసే ఈ స్మార్ట్‌‌ టీవీలో గత ఎంఐ టీవీల మాదిరే పరిమిత సంఖ్యలో బటన్లతో ఉన్న రిమోట్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వన్‌ప్లస్‌, టీసీఎల్‌ క్యూఎల్‌ఈడీ టీవీలకు ఈ టీవీ గట్టి పోటీనివ్వనుంది. వాటి ధర రూ.60 వేల పైబడి ఉంది.

ఇవీ చదవండి..

కొత్త గ్యాడ్జెట్‌: పరుగెత్తే అలారం

ఉత్తమ ‘పవర్‌’ బ్యాంక్‌లు.. తెలుసుకోండిలా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని