₹10వేల ధరలో మైక్రోమ్యాక్స్‌ కొత్త ఫోన్‌

దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇన్‌ 1 పేరుతో శుక్రవారం దీన్ని విడుదల చేసింది. ట్రిపుల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌.........

Published : 19 Mar 2021 18:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇన్‌ 1 పేరుతో శుక్రవారం దీన్ని విడుదల చేసింది. ట్రిపుల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వంటి ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో దీన్ని తీసుకొచ్చారు. 4జీబీ/ 64జీబీ, 6జీబీ/128జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ మార్చి 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మైక్రోమ్యాక్స్‌ వెబ్‌సైట్‌లలో అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,499 కాగా.. టాప్‌ వేరియంట్‌ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్‌ కింద ₹500 చొప్పున డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే మైక్రోమ్యాక్స్‌ ఇన్‌1 ఆండ్రాయిడ్‌ 10తో పనిచేస్తుంది. ఈ ఏడాది మే నాటికి 11 అప్‌డేట్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. అలాగే నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పాటు రెండేళ్ల వరకు అప్‌డేట్స్‌ ఇస్తామని ప్రకటించింది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందిస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌ మెమొరీని 256 జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే వీలుంది. వెనుక వైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందువైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్‌ 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని