Internet Explorer: లెజండరీ వెబ్‌ బ్రౌజర్‌కు వీడ్కోలు పలికిన మైక్రోసాఫ్ట్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే!

మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ తొలి తరం బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (Internet Explorer) సేవలు జూన్‌15, 2022 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే పలుమార్లు యూజర్లకు మెయిల్‌, సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది.

Published : 14 Jun 2022 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిటైర్‌మెంట్.. మనుషులకే కాదు, వస్తువులకు కూడా ఉంటుంది. చాలా సందర్భాల్లో వివిధ సంస్థలు తమ ఉత్పత్తులు లేదా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం చూస్తూనే ఉంటాం. తాజాగా మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ తొలి తరం బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (Internet Explorer) సేవలు జూన్‌15, 2022 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే పలుమార్లు యూజర్లకు మెయిల్‌, సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. తొలిసారిగా 1995లో విండోస్‌ 95 (Windows 95) ప్యాకేజ్‌లో భాగంగా ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది. తర్వాతి కాలంలో అందులో మార్పులు చేసినప్పటికీ.. యూజర్లు క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా వంటి బ్రౌజర్లకు మొగ్గుచూపారు.  ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ (Microsoft Edge)ను తీసుకొచ్చారు. ఇది వేగవంతమైన బ్రౌజర్ మాత్రమే కాదని‌, సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలానే యూజర్లు ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్ ఆధారిత వెబ్‌సైట్లను కూడా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

 నేపథ్యంలో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ సేవలు నిలిపివేయడంపై సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు యూజర్లు స్పందించారు. వాటిలో కొన్ని సరదా మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని