Published : 05/11/2021 23:27 IST

Windows 11 Update: విండోస్‌ 11లో ఈ యాప్‌లు పనిచేయడంలేదా.. ఇలా చేయండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్ కొత్త ఓఎస్‌ విండోస్‌11లో ఆసక్తికరమైన ఫీచర్స్‌ని పరిచయం చేసింది. అయితే వీటిలో స్నిపింగ్ టూల్స్‌, టచ్‌ కీబోర్డు, వాయిస్‌ టైపింగ్, ఎమోజీ ప్యానల్‌ వంటి యాప్‌లు గత కొద్ది రోజులుగా పనిచేయడంలేదని సమాచారం. దీంతో కొంతమంది యూజర్స్‌ ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ మైక్రోసాఫ్ట్ దృష్టి తీసుకొచ్చారు. దీనిపై మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన చేసింది. విండోస్‌ యాప్‌లలో ఉండే ఎక్స్‌పైరీ సర్టిఫికెట్ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. అక్టోబరు 31 నుంచి విండోస్‌లోని కొన్ని యాప్స్‌కి ఎక్స్‌పైరీ సర్టిఫికెట్ గడువు ముగియనుండటంతో సదరు యాప్స్‌ను కొద్ది మంది విండోస్‌ 11 యూజర్స్‌ ఉపయోగించలేరని తెలిపింది. అయితే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా మైక్రోసాఫ్ట్ KB5006746 అనే ప్యాచ్‌ను విడుదల చేసింది. దీన్ని అప్‌డేట్ చేసిన తర్వాత స్నిపింగ్ టూల్‌, టచ్‌ కీబోర్డు, వాయిస్‌ టైపింగ్, ఎమోజీ ప్యానెల్‌, ఎస్‌ మోడ్‌  తిరిగి పనిచేస్తాయని తెలిపింది.

అయితే త్వరలోనే ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం తీసుకొస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అలానే కొద్ది వారాల క్రితం విండోస్‌ 11లో బగ్‌ సమస్యను పరిష్కరించేందుకు విండోస్‌ 11 బిల్డ్‌ 220000.282 అనే అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది విండోస్‌ 11తో పనిచేసే కంప్యూటర్‌లలోని ఏఎమ్‌డీ రైజెన్‌ ప్రాసెసర్‌ సమస్యను పరిష్కరిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. గత విండోస్ ఓఎస్‌లతో పోలిస్తే విండోస్‌ 11లో మైక్రోసాఫ్ట్ ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. వాటిలో ఆండ్రాయిడ్ యాప్స్‌ని నేరుగా విండోస్‌ 11లో ఉపయోగించుకోవడం. అలానే స్టార్ట్ మెనూ స్క్రీన్‌ మధ్యలో ఉంచడం. స్టార్ట్ మెనూపై క్లిక్ చేయగానే యాప్స్‌ లిస్ట్‌ స్క్రీన్‌ సెంటర్‌లో పాప్‌ అప్‌ అవుతుంది. పాత ఓఎస్‌లో ఇది ఎడమవైపున ఉండేది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని