Microsoft Edge: మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా పనిచేస్తాయో తెలుసా?

మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఎడ్జ్ బ్రౌజర్‌లో రెండు కొత్త ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘వెబ్‌ సెలక్ట్‌’, ‘మైక్రోసాఫ్ట్‌ ఎడిటర్‌’  పేరుతో ఈ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.

Updated : 11 May 2022 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఎడ్జ్ బ్రౌజర్‌లో రెండు కొత్త ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వెబ్‌లో కంటెంట్‌ను సులువుగా కాపీ చేసేందుకు, అక్షర దోషాలను సరిదిద్దేందుకు ‘వెబ్‌ సెలక్ట్‌’, ‘మైక్రోసాఫ్ట్‌ ఎడిటర్‌’  పేరుతో ఈ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. మరి ఎడ్జ్‌ బ్రౌజర్‌లో ఈ కొత్త ఫీచర్లు ఎలా పనిచేస్తాయి? వాటి ప్రత్యేకలేంటో తెలుసుకుందామా..

మైక్రోసాప్ట్‌ ఎడిటర్‌:

మైక్రోసాఫ్ట్ ఎడిటర్ అనేది అక్షర దోషాలు (స్పెల్లింగ్), విరామ చిహ్నాలను చెక్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం రాసే టెక్ట్స్‌ను ఇంప్రూవ్‌ చేయడానికి కొన్ని సూచనలను కూడా అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ బ్రౌజర్‌లోని ఇది 20కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇది బ్రౌజర్‌లో ఉపయోగించే ప్రధాన భాషలో మాత్రమే పనిచేస్తుంది. అయితే, మైక్రోసాఫ్ట్‌ త్వరలో మనం రాయాలనుకున్న విషయాన్ని మరింత వేగవంతం చేయడం కోసం కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్‌, పోర్చుగీస్ భాషల్లోనూ గ్రామర్‌ కరెక్షన్స్‌ చేయడానికి టెక్ట్స్‌ ప్రిడిక్షన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌ సాయంతో ఎడిటర్ ఎక్స్‌టెన్షన్‌ను విడిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.


వెబ్‌ సెలక్ట్‌: 

వెబ్‌ నుంచి టెక్ట్స్‌ను సులువుగా కాపీ చేయడానికి ‘వెబ్‌ సెలక్ట్‌’ అనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీంతో టేబుల్స్‌, ఇమేజ్స్‌, టెక్ట్స్‌ను మనకు కావాలసిన ఫార్మాట్‌లో ఎంచుకోవడం సులభతరం అవుతుంది. దీంతో మొత్తం పేరాగ్రాఫ్‌లను ఒరిజినల్‌ ఫార్మాట్‌లో సెలక్ట్‌ చేసుకొని కాపీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్‌ను దాని అసలు ఫార్మాట్‌లో పేస్ట్‌ చేసుకోవడం కోసం ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. 

మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ల కోసం ఎడ్జ్‌ బ్రౌజర్‌లో టాప్‌లో కూడివైపున మూడు డాట్‌లతో కూడిన మెనూ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి హెల్ప్‌ అండ్‌ ఫీడ్‌ బ్యాక్‌లోకి వెళ్లి అబౌట్‌ మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ను సెలెక్ట్‌ చేసుకోని కొంత వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని