లేకున్నా.. ఉన్నట్లు చూపించే ‘మెష్’

త్రీడీ సినిమాలు చూసేందుకు ఆసక్తిగా ఉంటాయి. ఎందుకో తెలుసా..? సినిమాలోని క్యారెక్టర్లు మన పక్కనో....

Updated : 04 Mar 2021 09:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రీడీ సినిమాలు చూసేందుకు ఆసక్తిగా ఉంటాయి. ఎందుకో తెలుసా..? సినిమాలోని క్యారెక్టర్లు మన పక్కనో, మీదకొచ్చినట్లు ఉండటంతో ప్రేక్షకుడు బాగా కనెక్ట్‌ అయిపోతాడు. ఎన్నో అద్భుతమైన నూతన ఆవిష్కరణలు చేస్తున్న మైక్రోసాఫ్ట్‌ వర్చువల్‌ రియాల్టీ టెక్నాలజీలో మరొక ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్‌ ‘మెష్‌’ పేరుతో యూజర్లకు మిక్స్‌డ్‌ రియాల్టీ అనుభూతిని కల్పించనుంది. ఉత్పత్తికి సంబంధించిన వివరాలను మైక్రోసాఫ్ట్‌ తాజాగా ప్రకటించింది. ఉదాహరణకు మీరు సముద్రం మధ్యలో ఉన్నారనుకుందాం.. అక్కడ ఉండే చేపలు, తిమింగలాలు, ఇతర జీవాల మధ్య ఉన్నట్లే అనిపిస్తుంది. అలానే మిక్స్‌డ్‌ రియాల్టీ టెక్నాలజీతో ఇంట్లోనే ఉండి కొలీగ్స్‌తో ప్రాజెక్టుపై చర్చించేటప్పుడు అవతార్‌ రూపంలోనో లేదా ఇతర క్యారెక్టర్లగానో కనిపిస్తుంటారు. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ కంప్యూటింగ్‌ సర్వీస్‌ అజ్యూర్‌ సహకారంతో వేర్వేరు ప్రాంతాల్లో వివిధ డివైజ్‌లతో కనెక్ట్‌ అయి హోలోగ్రాఫిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకునే అవకాశం మైక్రోసాఫ్ట్‌ ‘మెష్‌’ ద్వారా కల్పించినట్లు సంస్థ తెలిపింది. 

వర్చువల్‌ డిజైన్‌ సెషన్స్‌, మీటింగులు, చర్చలు జరుపుకునేందుకు ఒకరినొకరు కలవాల్సిన అవసరం లేకుండానే మైక్రోసాఫ్ట్‌ మెష్‌ చక్కటి వేదికగా నిలుస్తుందని టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. మిక్స్‌డ్‌ రియాల్టీ టెక్నాలజీతో యూజర్లు ప్రత్యేక క్యారెక్టర్లను క్రియేట్‌ చేసే అవకాశం ఉంటుంది. దీని కోసం మొబైల్‌, ట్యాబ్స్‌, పీసీలు, వీఆర్‌ హెడ్‌సెట్లు, హోలోలెన్స్‌ వంటి పరికరాలతో ఎక్కడి నుంచైనా కనెక్ట్‌ కావచ్చని సంస్థ పేర్కొంది. ఉదాహరణకు.. హోలోలెన్స్‌ను వినియోగించి ఇంజినీర్లు, డిజైనర్లు సైకిల్ నుంచి విమానం వరకు తమ ఉత్పత్తులకు సంబంధించి దేనిపైనైనా త్రీడీ టెక్నాలజీతో చర్చించుకోవచ్చు. దీని ద్వారా భౌతికంగా ఆ ఉత్పత్తి లేకపోయినా చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి చర్చించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలానే ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు త్రీడీ ఎఫెక్ట్‌లో నిర్మాణంలోని పరిశ్రమ ఫ్లోర్‌ను పరిశీలించి ఎక్కడ ఎలాంటి యంత్రాలను ఫిట్‌ చేయాలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనవసరమైన ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని