
Microsoft Loop: మైక్రోసాఫ్ట్ లూప్... యాప్ ఓపెన్ చేయకుండానే ఎడిట్
ఇంటర్నెట్ డెస్క్: ఆఫీస్ అప్లికేషన్స్‌కు కంటెంట్‌ను షేర్ చేయడానికి సహకార సాధనంగా మైక్రోసాఫ్ట్ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దాని పేరు మైక్రోసాఫ్ట్ లూప్. దీని ద్వారా పోర్టబుల్ కంపోనెంట్స్‌ను ఇతర అప్లికేషన్లకు షేర్, ఎడిట్ చేయవచ్చు. దీంతో లార్జ్ డాక్యుమెంట్స్, బిజినెస్ ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ డాక్యుమెంట్స్‌ను ఇతర మైక్రోసాఫ్ట్ యాప్‌లకు డేటాను వేగంగా షేర్ చేయవచ్చు. మరి మైక్రోసాఫ్ట్ లూప్ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా!
* మైక్రోసాఫ్ట్ లూప్ ఇతర ఆఫీస్ అప్లికేషన్స్‌కు కంటెంట్ బ్లాక్‌లను షేర్ చేయడంతో పాటు రియల్ టైమ్ అప్డేట్ కూడా చేయవచ్చు.
* షేర్ చేసిన లూప్ కాంపోనెంట్‌ను యాప్ ఓపెన్ చేయకుండానే ఏదైనా ఆఫీస్ అప్లికేషన్లో ఎడిట్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంది.
* ఆఫీస్ కంటెంట్‌లో లెగో బ్లాక్‌ల వంటి లూప్ కంపోనెంట్లు ఉంటాయి. ఇవి టేబుల్స్, నోట్స్ వంటి వాటితోనే కాకుండా మరింత అధునాతనమైన వాటినీ కలిగి ఉంటాయి.
* ఆఫీస్ యాప్‌లలో సాధారణ గ్రాఫ్‌లు, టేబుల్లు, నోట్స్ మొదలైన వాటితో పాటు, లూప్ కంపోనెంట్లలో ఓటింగ్ టేబుల్, స్టేటస్ ట్రాకర్ వంటి కొత్త కంటెంట్ బ్లాక్‌లు కూడా ఉంటాయి.
* యాప్ మారకుండానే ఏ అప్లికేషన్లో నుంచి అయినా ఈమెయిల్ యాప్‌లో లూప్ కంపోనెంట్‌ను, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో చాట్‌ను లూప్ పేజీలో ఎడిట్ చేయవచ్చు.
* గూగుల్ డాక్యుమెంట్ల మాదిరిగానే లూప్ కంపోనెంట్లు ఇక ఎల్లప్పుడూ సింక్రనైజ్ అవుతూ ఉంటాయి.
* మైక్రోసాఫ్ట్ లూప్ మైక్రోసాఫ్ట్‌లోని 365 యాప్స్‌లో నవంబరులో అందుబాటులోకి తీసుకొస్తారు. దీన్ని ఔట్లుక్, వన్ నోట్, టీమ్స్ వంటి వాటిల్లోనూ అందబాటులోకి తీసుకొస్తారట.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.