Microsoft Teams: టీమ్స్‌ కొత్త ఫీచర్‌.. వీడియోను దాచేయొచ్చు!

మైక్రోసాఫ్ట్ వీడియో కాలింగ్ టూల్ టీమ్స్‌ యూజర్స్‌ కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్స్ తమ వీడియోను హైడ్‌ చేయొచ్చు. 

Published : 11 Jan 2022 21:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘హైడ్‌ యువర్ ఓన్‌ వీడియో’ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్‌ వీడియో కాల్ మాట్లాడేప్పుడు స్క్రీన్‌పై తమ వీడియో ఇతరులకు కనిపించకుండా చేయొచ్చు. ఎంతోకాలంగా ఈ ఫీచర్‌ కావాలని కోరుతూ చాలా మంది యూజర్స్ మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ కమ్యూనిటీల్లో సందేశాలు పెడుతున్నారట. అంతేకాకుండా టీమ్స్‌ ద్వారా వీడియో కాల్‌ మధ్యలో స్క్రీన్‌ షేర్ చేసేప్పుడు కుడివైపు చివర్లో యూజర్‌ ఫొటో కూడా కనిపించేది. దీనిపై పలువురు యూజర్స్ ఫిర్యాదు చేయడంతో మైక్రోసాఫ్ట్ ‘హైడ్‌ యువర్ ఓన్‌ వీడియో’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

భారత్‌ సహా ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతుండటంతో ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయించేందుకే సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు, సమావేశాల కోసం ఉద్యోగులు ఎక్కువగా టీమ్స్ వంటి వీడియో కాలింగ్ సేవలను అందించే టూల్స్‌పై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో టీమ్స్‌ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. గతేడాది చివర్లో మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ కాల్స్‌కు కూడా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని