
Microsoft Teams: ప్రొఫైల్ కార్డులో కొత్త ఫీచర్..షేర్, హైడ్ చాట్.. ఇంకా
ఇంటర్నెట్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్తగా మరికొన్ని ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనుంది. ఇందులో ప్రధానంగా లోకల్ టైమ్, షేర్డ్ చాట్స్, హైడ్ పీచర్లున్నాయి. వీటిలో లోకల్ టైమ్ సాయంతో వేర్వేరు ప్రదేశాల్లో ఉండి ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సహోద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలోని సమయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం సదరు యూజర్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో యూజర్ ప్రొఫైల్‌పై క్లిక్ చేస్తే ఫోన్ కాల్స్, ఈ-మెయిల్, స్టేటస్ వంటి వివరాలు మాత్రమే ఉండేవి. తాజా అప్‌డేట్‌లో యూజర్ లోకల్ టైమ్ తెలిపే ఫీచర్‌ను కూడా యాడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌తో యూజర్స్ వేర్వేరు టైమ్ జోన్ల నుంచి టీమ్స్ ద్వారా సులభంగా కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోకల్ టైమ్ ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
అలానే షేర్డ్ చాట్స్ ఫీచర్‌తో యూజర్స్ టీమ్స్‌లోని తమ ఆర్గనైజేషన్ బయట చాట్స్, సమావేశాలు నిర్వహించవచ్చు. ఇక హైడ్ ఫీచర్‌తో యూజర్స్ చాట్ పేజీలోని మెసేజ్‌లను హైడ్ చేయొచ్చు. గతంలో యూజర్స్ టీమ్స్ నుంచి తమ చాట్ పేజీలో మెసేజ్‌లను డిలీట్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. దానికి బదులు యూజర్ తమ చాట్ కనిపించకుండా చేసేందుకు హైడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దానిపై క్లిక్ చేసి చాట్ మెసేజ్‌ను హైడ్ చేయొచ్చు. ఒక వేళ పూర్తి చాట్ సంభాషణలను డిలీట్ చేయాలంటే మాత్రం చాట్ పేజీలో ఎడమవైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాట్ పేజీలోని సంభాషణలు పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇవేకాకుండా మైక్రోసాఫ్ట్ టీమ్స్ డెస్క్‌టాప్ యూజర్స్ కోసం ఎమోజీ ఫీచర్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసురానున్నట్లు సమాచారం.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.