- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో నాలుగు కొత్త ఫీచర్లు.. చాట్ ఫిల్టర్స్, రిప్లై సజెస్ట్.. ఇంకా!
ఇంటర్నెట్‌డెస్క్: యూజర్లు మరింత సమర్థవంతంగా టీమ్స్‌ను వినియోగించుకునేందుకు మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఫీచర్లు టెక్ట్స్ టైప్ చేసేప్పుడు ఎదురుయ్యే సమస్యలను అధిగమించడంతోపాటు, సమర్థవంతమైన పదాలు ఉపయోగించేలా యూజర్లకు సాయపడతాయని తెలిపింది. మరి ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
టెక్ట్స్ ప్రిడిక్షన్ (Text Prediction)
ఈ ఫీచర్‌తో యూజర్లు మెసేజింగ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు. యూజర్ ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు అందులో కచ్చితంగా సరిపోయే పదాలను ముందుగానే సూచించడంతోపాటు తప్పులు పోకుండా వాక్యం పూర్తి చేసేలా సాయం చేస్తుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించారు. దీనివల్ల యూజర్ సమయం ఆదా అవడమే కాకుండా, టైపింగ్‌లో తప్పులు పోకుండా వాక్యాలను పూర్తి చేయొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఫ్లూయెంట్ ఎమోజీస్ (Fluent Emojis)
మైక్రోసాఫ్ట్ టీమ్స్తోపాటు ఎమ్365లో ఎమోజీలు, ఎమోజీ రియాక్షన్స్‌ను మైక్రోసాఫ్ట్ ఫ్లూయెంట్ ఎమోజీ స్టైల్‌కు అనుగుణంగా మార్చారు. దీనివల్ల యూజర్లకు సుమారు 1,800 ఎమోజీలు అందుబాటులోకి వస్తాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలా యూజర్లు తాము చెప్పాలనుకునే భావాన్ని ఎమోజీల సాయంతో మరింత సమర్థవంతంగా తెలియజేయగలుగుతారని అభిప్రాయపడింది.
రిప్లై సజెస్ట్‌డ్ (Suggested Replies)
టీమ్స్ చాట్‌లో యూజర్లుకు వచ్చే మెసేజ్‌లకు ఎలాంటి రిప్లై ఇవ్వాలనేది సూచిస్తుంది. మెసేజ్‌లో సారాంశం, అంతకు ముందు జరిగిన సంభాషణల ఆధారంగా మూడు రిప్లైలను మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్‌కు సూచిస్తుంది. వాటిలో యూజర్‌కు నచ్చిన రిప్లైను సెలెక్ట్ చేస్తే అది అవతలి వారికి చేరుతుంది.
చాట్ ఫిల్టర్స్ (Chat Filters)
గతంలో యూజర్ల మధ్య జరిగిన చాట్ సంభాషణలను సులువుగా వెతికేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో వ్యక్తిగత సంభాషణలతోపాటు, గ్రూప్ చాట్లను కూడా వెతకవచ్చు. పవర్ ఆటోమేట్ పోర్టల్ ద్వారా ఫైల్స్‌ను కూడా సులువుగా అప్లోడ్ చేయొచ్చని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. గతంలో యూజర్ ఏదైనా సమాచారంతో కూడిన డాక్యుమెంట్ షేర్ చేయాలంటే దానికి సంబంధించిన లైవ్ ఆన్లైన్ లింక్ లేదా యూజర్ రిక్వెస్ట్ ద్వారా ఫైల్ అటాచ్ చేసేవారు. తాజాగా తీసుకొచ్చిన పవర్ ఆటోమేట్ పోర్టల్ ఫీచర్‌తో డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన వెంటనే టీమ్‌లోని సభ్యులకు కనిపిస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
- ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
- CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
- Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
- AIFF: ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవి.. బరిలో దిగిన టీమ్ఇండియా ఫుట్‌బాల్ దిగ్గజం