Walkie Talkie: ఈ యాప్‌లు ఉంటే.. మీ మొబైలే ‘వాకీటాకీ’

మొబైల్‌ల్లోనూ పలు వాకీటాకీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ యాప్‌లెంటో చూసేద్దామా..

Updated : 23 Dec 2021 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైర్‌లెస్‌ సెట్‌ ‘వాకీటాకీ’ల వినియోగం గురించి పెద్దగా మనకు అవగాహన లేకున్నా..  ‘వాకీటాకీ’ల ద్వారా ఏకకాలంలో సిబ్బంది అందర్నీ అటెన్షన్‌ చేసి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత నవ యుగంలో నిర్మాణ స్థలాలు, పెద్దపెద్ద భవనాల్లో సెక్యూరిటీ గార్డు, వాచ్‌మెన్లు తక్షణ వాయిస్‌చాట్‌ కోసం ఇప్పటికీ ‘వాకీటాకీల’ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ల్లోనూ (ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌) పలు వాకీటాకీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. నిజమైన వాకీటాకీల మాదిరి ఇవీ పనిచేయడమే కాకుండా.. 2జీ వేగంలోనూ సమర్థంగా వాడుకోవచ్చు. మరి ఆ యాప్‌లెంటో చూసేద్దామా.. 

1. Zello PTT Walkie Talkie 

ఉత్తమ వాకీటాకీ యాప్‌లలో Zello PTT Walkie Talkie ఒకటి. దీని ఖాతా సెటప్‌ చాలా సులువు. ఇందులో మీరు ఒకేసారి 2,500 మంది వినియోగదారులతో పబ్లిక్ లేదా ప్రైవేట్ ఛానెల్‌ ఏర్పాటు చేసుకొని వాయిస్‌ చాట్ చేసుకోవచ్చు. వాకీటాకీ నడుస్తున్న వేళల్లోనూ మీ ఇన్‌కమింగ్ కాల్‌ను ఎంచక్కా మాట్లాడుకోవచ్చు. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌వాచ్‌లకూ ఈ యాప్‌ టెక్ట్స్‌ మెసేజింగ్‌ సేవలనూ అందిస్తుంది. క్యూఆర్‌ కోడ్ ఫీచర్ ద్వారా మీ కాంటాక్ట్‌ను ఇతరులతో షేర్‌ చేయొచ్చు. పైగా ఈ యాప్‌ పూర్తి ఉచితం.

2. Intercom

ఇది బ్లూటూత్‌ ఆధారిత వాకీటాకీ. ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేకున్నా బ్లూటూత్‌, వైఫై ఆధారంగా పనిచేస్తుంది. పాఠశాల, షాపింగ్ మాల్, కార్యాలయ భవనం వంటి తక్కువ సమీపంలోని వ్యక్తులతో ఈ యాప్‌ ద్వారా ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు. యాప్‌ ఉచితంగా లభిస్తుండటమే కాకుండా సబ్‌స్ర్కిప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

3. Modulo PTT Walkie Talkie

ఇది అటుఇటుగా మెసేజింగ్‌ యాప్‌లానే పనిచేస్తుంది. ఇందులో గ్రూప్‌ ఏర్పాటు చేయడానికి, స్నేహితులు చేరడానికి వ్యక్తిగతంగా ఎవరికివారు సైన్‌అప్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వాయిస్‌ చాట్‌ రిజర్వ్‌ బృందం మధ్యే ఉంటుంది. ఇందులో వాయిస్‌ చాట్‌ వేళ మీరు ఆఫ్‌లైన్‌లో ఉంటే ఆ తర్వాత చాట్‌ వినే అవకాశం ఉంటుంది. ఇతర ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు.

4. Walkie Talkie

ఫ్రీక్వెన్సీ (frequency) ఆధారిత వాకీటాకీ‌. ఇందులో మీరు ఫ్రీక్వెన్సీ ట్యూన్‌ చేసి మాట్లాడాలి. అటువైపు ఉన్న వ్యక్తులూ అదే ఫ్రీక్వెన్సీలో సంభాషించాలి. ఇందులో పబ్లిక్‌, ప్రైవేటు రెండు రకాల ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. పబ్లిక్‌లో ఎవరైన అపరిచితులు అదే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే.. మీ సంభాషణ వారు కూడా వినగలరన్న సంగతిని మరవద్దు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌తో పాటు డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లోనూ ఈ యాప్‌ పని చేస్తుంది.  

5. Voxer Walkie Talkie Messenger

దీనిని మెసేజింగ్‌ యాప్‌, వాకీటాకీ ఫంక్షనాలిటీ రెండింటి ఆధారంగా తీర్చిదిద్దారు. మెసేజింగ్‌ యాప్‌ మాదిరి ఇందులో స్నేహితులతో గ్రూప్‌ క్రియెట్‌ చేసుకోవచ్చు. వాకీటాకీ మాదిరి వాయిస్‌చాట్‌ వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని