New Samrtphones Launch: రేపు మోటో..ఎల్లుండి వన్‌ప్లస్‌!

మోటోరోలా ఈ 40 కొత్త ఫోన్‌ను అక్టోబరు 12న విడుదల చేస్తుండగా.. వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబరు 13న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 

Updated : 05 Aug 2022 16:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్‌ప్లస్‌, మోటోరోలా కంపెనీలు కొత్త మోడల్‌ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. అక్టోబరు 12న మోటోరోలా ఈ40 మోడల్‌ను తీసుకొస్తుండగా, అక్టోబరు 13న వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ మోడల్‌ను పరిచయం చేయనుంది. మరి ఈ మోడల్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?.. వాటి ధరెంత? వంటి వివరాలు తెలుసుకుందాం. 


మోటో ఈ40

మోటోరోలా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఈ మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో హెచ్‌+ రిజల్యూషన్‌తో ఎల్‌సీడీ స్క్రీన్‌ ఇస్తున్నారు. యూనిసాక్‌ టీ700 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారట. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుదని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కి ఐపీ52 వాటర్‌ రెసిస్టెంట్ రేటింగ్‌ కూడా ఉంది. పింక్‌ క్లే, కార్బన్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారట. ఈ ఫోన్‌లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారని తెలుస్తోంది. అలానే ఫేస్‌ అన్‌లాకింగ్ ఫీచర్‌ కూడా ఉంటుందని సమాచారం. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ వేరియంట్లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారట. 


వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్ ఉపయోగించారట. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారని సమాచారం. అలానే ఈ ఫోన్ 65 వాట్ వ్రాప్‌ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఇందులో వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. 600 హెర్జ్‌ టచ్‌ శాప్లింగ్ రేట్‌, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఫోన్‌ వేడెక్కుండా ఐదు పొరల కూలింగ్ సిస్టమ్‌ అమర్చినట్లు టెక్ వర్గాలు తెలిపాయి. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ మెమొరీ, 8 జీబీ/ 256 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లో ఈ ఫోన్‌ను విడుదల చేస్తారని సమాచారం. దీని ప్రారంభ ధర రూ. 39,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని