మోటోరోలా నుంచి బడ్జెట్ ఫోన్‌..ధరెంతంటే..?

అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా మధ్యశ్రేణి ధరలో కొత్త మోడల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన జీ8 మోడల్‌కు కొనసాగింపుగా....

Updated : 05 Aug 2022 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా మధ్యశ్రేణి ధరలో కొత్త మోడల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన జీ8 మోడల్‌కు కొనసాగింపుగా మోటో జీ9 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్‌మీ నోట్ 9 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మీ 6ఐకు జీ9 గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ మాక్స్ విజన్‌ టీఎఫ్‌టీ డిస్ప్లేను ఇస్తున్నారు. ఆక్టాకోర్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒకటి అమర్చారు. వెనకవైపున క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, డెప్త్‌ సెన్సార్‌తో 2 ఎంపీ కెమెరా, మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. దీనిలో ఆటో స్మైల్ క్యాప్చర్‌, హెడీఆర్‌, ఫేస్‌బ్యూటీ, మాన్యువల్ మోడ్, రా ఫోటో అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఒక సారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్‌‌ ఫీచర్ కూడా ఉంది. 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 11,499గా సంస్థ నిర్ణయించింది. ఫారెస్ట్‌ గ్రీన్‌, సప్ఫైర్‌ బ్లూ రంగుల్లో జీ9 లభించనుంది. ఆగస్టు 31 నుంచి ఫ్లిప్‌కార్టలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని