మోటో నుంచి తొలి బడ్జెట్‌ 5జీ ఫోన్‌

మోటోరోలా కొత్త సంవత్సరంలో వరుస లాంఛ్‌లతో అదరగొట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో మోటోరోలా నియో, కాప్రీ, కాప్రీ ప్లస్ మోడల్స్‌ను తీసుకురానుంది. ఇవే కాకుండా బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను కొత్త ఏడాది తొలి...

Updated : 05 Aug 2022 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవత్సరంలో వరుస లాంచ్‌లతో అదరగొట్టేందుకు మోటోరొలా సిద్ధమవుతోంది. స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో మోటోరోలా నియో, కాప్రీ, కాప్రీ ప్లస్ మోడల్స్‌ను తీసుకురానుంది. ఇవే కాకుండా బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మోటోరోలా ఇబిజా పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఆన్‌లైన్‌లో ఇప్పుడు తెగ సందడి చేస్తున్నాయి.

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 400 సిరీస్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారట. ఇది 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. అయితే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 400 సిరీస్‌లో 5జీని సపోర్ట్‌ చేసే ప్రాసెసర్‌లు ప్రస్తుతానికైతే లేవు. ప్రస్తుతం అవి అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో మోటోరొలా మాత్రం త్వరలోనే బడ్జెట్‌ ఫోన్‌ 5జీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మోటోరొలా ఇబిజానే స్నాప్‌డ్రాగన్‌ 400 ప్రాసెసర్‌తో వస్తున్న తొలి బడ్జెట్‌ 5జీ మోడల్‌ అని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలానే 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌తో ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. అలానే 4జీబీ/ 128జీబీ వేరియంట్లో లభించనుందని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందట. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికొస్తే లిబిజాలో 48ఎంపీ ప్రైమరీ శాంసంగ్ సెన్సర్‌ కెమెరాతో పాటు 5 ఎంపీ మాక్రో సెన్సర్ కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సింగ్ కెమెరా ఉంటాయట. సెల్ఫీల కోసం 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారట. అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ధరెంత? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని